తనను విజయసాయి రెడ్డితో పోల్చిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో తన ఆశీస్సులు పొంది, ఎన్నికలకు డబ్బులు తీసుకువెళ్లిన విషయాన్ని బొత్స గుర్తుంచుకోవాలని డిమాండ్ చేశారు. అనవసరంగా తన జోలికి వస్తే గుండు గీయిస్తానని హెచ్చరించారు.