AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: ఇంటి నుంచే వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? కేంద్రం నుంచి రూ.10 లక్షలు.. దరఖాస్తు చేస్కోండి..

కేంద్ర ప్రభుత్వం వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునేవారి కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. వాటిల్లో ఫుడ్ బిజినెస్‌కు లోన్ అందించే స్కీమ్ కూడా ఒకటి ఉంది. స్నాక్స్, స్వీట్స్, జ్యూస్ లాంటివి విక్రయించడం ద్వారా ఆదాయం పొందాలనుకుంటే సబ్సిడీ ద్వారా వ్యాపారం స్టార్ చేయవచ్చు.

Central Government: ఇంటి నుంచే వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? కేంద్రం నుంచి  రూ.10 లక్షలు.. దరఖాస్తు చేస్కోండి..
Loan
Venkatrao Lella
|

Updated on: Sep 01, 2026 | 3:47 PM

Share

మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా..? స్నాక్స్, స్వీట్స్, పాపడ్, పచ్చళ్లు, జ్యూస్‌లు లేదా ఇతర ఆహార పదార్థాలు అమ్మే చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా..? మీకు ఆసక్తి ఉన్నా పెట్టుబడి కోసం నిధులు లేక ఆగపోయారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం మీ వ్యాపారం ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ సదుపాయం కల్పిస్తోంది. ఇందుకోసం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకాన్ని(PMFME) అమలు చేస్తోంది. మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి వ్యాపారాలు మొదలుపెట్టాలనుకుంటే ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. చిన్న ఆహార వ్యాపారాలను ప్రోత్సహించేందుకు పథకం ఈ పథకం అమల్లోకి తెచ్చింది. ఈ పథకంలో ఎలా లబ్ది పొందాలి..? అర్హతలు ఏంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.10 లక్షల వరకు సబ్సిడీ

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థల పథకం (PMFME) ఎప్పటినుంచో అమల్లో ఉంది. చిన్, అసంఘటిత ఆహార వ్యాపారాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కీ్మ్ తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఏదైనా చిన్న ఆహార పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు లేదా వ్యాపారం పెట్టాలనుకునేవారికి రూ.10 లక్షల సబ్సిడీ కేంద్రం అందిస్తోంది. ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు. ఆర్ధిక ఇబ్బందులు లేకుండా చిన్న వ్యాపారాలను నిర్వహించుకోవడంతో పాటు ఉత్పత్తి పెంచుకోడం, తమ ప్రొడక్ట్స్‌ను మార్కెటింగ్ చేసుకునేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి.

సబ్సిడీ ఎలా అందిస్తారు..?

మీ వ్యాపారానికి సంబంధించి ఒక ప్రాజెక్టును సిద్దం చేసి బ్యాంక్ నుంచి రుణం పొందవచ్చు. రుణంపై 35 శాతం వరకు రాయితీ పొందవచ్చు గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ సదుపాయం ఉంటుంది. ఒకవేళ మీ ప్రాజెక్ట్ ఖర్చు రూ.10 లక్షలు అనుకుంటే రూ.3.5 లక్షల రాయితీ అందుతుంది. ప్రాజెక్ట్ వ్యయం ఎక్కువగా ఉంటే రూ.10 లక్షల వరకు పొందవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మీ వ్యాపారానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్దం చేసుకుని ఉండాలి. ప్రాజెక్టు రిపోర్టుతో పాటు వ్యాపార పత్రాలు, పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు కలిగి ఉండాలి. PMFME పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ అర్హతలను అధికారులు పరిశీలించి ఆమోదం తెలుపుతారు. మీ దరఖాస్తు ఆమోదం పొందితేనే సబ్సిడీ అందుతుంది. అలాగే స్వయం సహాయక బృందాలతో (ఎస్‌హెచ్‌జీలతో) అనుబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అర్హులైన ఎస్‌హెచ్‌జీ సభ్యులు చిన్న పరికరాలను కొనుగోలు చేసేందుకు రోజువారీ వ్యాపార ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.40 వేల వరకు ప్రారంభ మూలధనాన్ని పొందవచ్చు.

Follow Us