AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: ఆన్‌లైన్ ద్వారా పాన్ కార్డులోని సిగ్నేచర్ మార్చుకోవడం ఎలా..? సులువుగా ఇలా చేసుకోవచ్చు.. ఎలానో చూడండి..

పాన్ కార్డులో వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవడం ముఖ్య. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ తెరవడం దగ్గర నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేంతవరకు ఇది ఉపయోగపడుతుంది. చాలా పనులకు దీని అవసరం ఉండటంతో వివరాలు అప్డేట్‌గా ఉంచుకోవాలి. పాన్ కార్డులోని సిగ్నేచర్ మీరు మార్చుకోవడం ఎలా..

Pan Card: ఆన్‌లైన్ ద్వారా పాన్ కార్డులోని సిగ్నేచర్ మార్చుకోవడం ఎలా..? సులువుగా ఇలా చేసుకోవచ్చు.. ఎలానో చూడండి..
Pan Card
Venkatrao Lella
|

Updated on: Sep 20, 2026 | 6:22 PM

Share

ఆధార్ కార్డు తర్వాత అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ల జాబితాలో పాన్ కార్డ్ రెండో స్థానంలో ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, పెద్ద మొత్తంలో బ్యాంకులో నగదు డిపాజిట్ చేయాలన్నా, రుణం పొందాలన్నా, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, స్టాక్ మార్కెట్లతో పాటు మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. అలాగే వివిధ లావాదేవీలకు పాన్ కార్డు అవసరం. ఇదే కాకుండా ఒక గుర్తింపు ధృవీకరణ పత్రంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే ప్రతీఒక్కరికీ పాన్ అనేది తప్పనిసరి అని చెప్పవచ్చు. పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా పాన్ పొందవచ్చు. ఇక పాన్ కార్డులో మార్పులు కూడా చేసుకోవచ్చు. పాన్ కార్డుపై ఉండే సంతకాన్ని కూడా మీరు మార్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎలా అప్డేట్ చేసుకోవాలని చూద్దాం.

ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్ సిగ్నేచర్ మార్చుకోవడం ఎలా..?

-https://tinpan.proteantech.in/services/pan/pan-index#faqs లింకుపై క్లిక్ చేయండి

-ఛేంజ్, కరెక్షన్ ఇన్ పాన్ డేటా అనే ఆప్షన్ ఎంచుకోండి

-పాన్ కరెక్షన్ అప్లికేషన్ నింపండి

-మీ పాన్, వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి

-అవసరమైన ఇన్పర్మేషన్ మొత్తం అందించండి

-అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది

-ఆ తర్వాత ఒక టోకెన్ నెంటర్ జనరేట్ అవుతుంది

-ఈ-సైన్ ఆప్షన్ ద్వారా ఫొటోలు అప్ లోడ్ చేసే ఆప్షన్ ఎంచుకోండి

-మీరు ఏ వివరాలు అయితే మార్చాలనుకుంటున్నారో వాటి వివరాలు నమోదు చేయండి

-అనంతరం మీ కొత్త సిగ్నేచర్ అప్ లోడ్ చేయండి

-అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి

-ఆ తర్వాత సర్వీస్ ఛార్జీ డిజిటల్ విధానంలో చెల్లించండి

-ఆధార్ ఆథెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేయండి

-అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అక్‌నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వస్తుంది

-అక్‌నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ద్వారా మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు

సిగ్నేచర్ అప్డేట్ చేసుకోవడం ఎందుకు..?

-వివిధ సేవలు పొందే సమయంలో గుర్తింపు ధృవీకరణ కోసం సిగ్నేచర్ ఉపయోగపడుతుంది. రుణాలు పొందే సమయంలో మీరే అసలైన వ్యక్తి.. కాదా అనేది గుర్తించేందుకు సహాయడపతుంది. ప్రభుత్వ సేవలు సులభతరంగా పొందటంలో యూజ్ అవుతుంది. పాన్ కార్డు జారీ చేసినప్పుడు సిగ్నేచర్ తప్పుగా పడటం లేదా అస్పష్టంగా ఉండటం వంటివి చోటుచేసుకుంటాయి. ఇలాంటి సమయంలో మీరు సులువుగా ఇంటి వద్ద నుంచే ఆన్ లైన్ ద్వారా సిగ్నేచర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పిస్తోంది.

Follow Us
పాన్ కార్డు సిగ్నేచర్ ఆన్‌లైన్ ద్వారా మార్చుకోవడం ఎలా..?
పాన్ కార్డు సిగ్నేచర్ ఆన్‌లైన్ ద్వారా మార్చుకోవడం ఎలా..?
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు..
10ఏళ్ల ప్రేమ.. ప్రియుడి నమ్మకద్రోహం.. చివరకు యువతి ఊహించని..
10ఏళ్ల ప్రేమ.. ప్రియుడి నమ్మకద్రోహం.. చివరకు యువతి ఊహించని..
తెలంగాణ రైతులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్..
తెలంగాణ రైతులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్..
ఆలూ-రవ్వ స్నాక్.. ఒక్కసారి రుచి చూస్తే ఇడ్లీ.. దోస.. మర్చిపోతారు!
ఆలూ-రవ్వ స్నాక్.. ఒక్కసారి రుచి చూస్తే ఇడ్లీ.. దోస.. మర్చిపోతారు!
బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ ఛాన్స్ వస్తే మాత్రం వెళ్ళాను..
బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ ఛాన్స్ వస్తే మాత్రం వెళ్ళాను..
దోస.. ఇడ్లీ.. బోర్ కొడితే అప్పటికప్పుడు ఈ ఉల్లి బోండా ట్రై చేయండి
దోస.. ఇడ్లీ.. బోర్ కొడితే అప్పటికప్పుడు ఈ ఉల్లి బోండా ట్రై చేయండి
దోశను ఇంగ్లీషులో ఏమంటారు..? 99శాతం మందికి తెలియని అసలు నిజం..
దోశను ఇంగ్లీషులో ఏమంటారు..? 99శాతం మందికి తెలియని అసలు నిజం..
వర్షాకాలంలో కోడి కూరను ఇలా తింటే జలుబు, దగ్గు పారిపోతాయ్..
వర్షాకాలంలో కోడి కూరను ఇలా తింటే జలుబు, దగ్గు పారిపోతాయ్..
లిఫ్ట్‌కు - గోడ‌కు మ‌ధ్య వేలాడుతుండ‌గా హైడ్రా ఆప‌రేష‌న్‌
లిఫ్ట్‌కు - గోడ‌కు మ‌ధ్య వేలాడుతుండ‌గా హైడ్రా ఆప‌రేష‌న్‌