గంటకు 50 కి.మీ వేగం మాత్రమే.. ఈ వందే భారత్ రైలు డిఫరెంట్..
Venkatrao Lella
Images: Pinterest
06 NOV 2026
వందే భారత్ రైళ్లను సెమీ హైస్పీడ్ రైళ్లుగా పిలుస్తున్నారు. ఇవి గంటకు గరిష్టంగా 160 కి.మీ వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ అత్యంత నెమ్మదిగా నడిచే వందే భారత్ రైలుగా ఇది నిలవనుంది.
బెంగళూరు-గోవా వందే భారత్ రైలును త్వరలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమైంది. ఇది 670 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుండగా.. కేవలం ఇది గంటకు 53-54 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణించనుంది.
సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్‌లతో సమాన వేగంతో ఈ వందే భారత్ రైలు ప్రయాణించనుంది. దీంతో దేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే వందే భారత్ రైలుగా ఇది నిలవనుంది. ట్రాక్ పరిస్థితి, వాణిజ్య సర్వీసుల కారణంగా ఈ రైలు వేగాన్ని పరిమితం చేశారు.
670 దూరాన్ని ఈ వందే భారత్ రైలు 12 నుంచి 13 గంటల్లో చేరుకోనుంది. ఈ ట్రాక్‌లో ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ట్రైన్లు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. వాణిజ్య కార్యకలాపాల కారణంగా వేగానికి సంబంధించి పరిమితులు విధించారు.
బెంగళూరు-గోవా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వెళ్లేటప్పుడు 12 గంటల 20 నిమిషాల్లో, తిరుగు ప్రయాణంలో 12 గంటల 55 నిమిషాల్లో గమ్యస్థానికి చేరుకుంటుంది. బెంగళూరు-గోవా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కంటే తక్కువ వేగంతో వెళ్లనుంది.
గంటకు 55 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ సగటు వేగం ఉన్న రైళ్లను సూపర్‌ఫాస్ట్ రైళ్లుగా భావిస్తున్నారు. ఇప్పుడు వాటితో సమానమైన వేగంతో ఈ వందే భారత్ రైలు ప్రయాణించనుంది
ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లల్లో పూణే-అజ్ని రైలు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. 882 కి.మీ దూరాన్ని 12 గంటల్లో పూర్తి చేస్తుంది. వారణాసి-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలోనే అత్యంత వేగవంతమైన వాటిలో ఒకటిగా నిలుస్తోంది.
వారణాసి-ఢిల్లీ రైలు గంటకు 95 కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 759 కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిది గంటలలో పూర్తి చేస్తుంది.