November 6, 2026
Subhash
మొబైల్ యూజర్లకు దీపావళి సందర్భంగా భారీ ఊరట కలిగింది. టెలికాం కంపెనీలు తక్కువ ధరతో కూడిన రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి.
ప్రముఖ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వీఐతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా తక్కువ ధర టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి.
జియో రూ.147 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులు మాత్రమే ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు.
28 రోజుల ప్లాన్ ధర రూ.177, 30 రోజుల ప్లాన్ ధర రూ.196, ఒక క్యాలెండర్ ప్లాన్ ధర రూ.197గా నిర్ణయించింది.
84 రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.448గా ఉంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, వెయ్యి SMSలు,336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.1748.
ఎయిర్‌టెల్ 28 రోజుల వాయిస్ ప్లాన్ ధర రూ.185, 30 రోజుల వ్యాలిడిటీతో ఉండే ప్లాన్ ధర 203 రూపాయలు.
క్యాలెండర్ నెల ప్లాన్ ధర రూ.206, 84 రోజుల ప్లాన్ ధర రూ.469, 365 రోజుల ప్యాన్ ధర రూ.1849గా ఉంది.
వొడాఫోన్ ఐడియా 25 రోజుల వ్యాలిడిటీ వాయిస్ ఓన్లీ ప్లాన్ ధర రూ.179, 28 రోజులకు ప్లాన్ ధర రూ.158., 30 రోజులకు ధర రూ.203గా ఉంది.