ఆస్పత్రుల్లో రూ.1.5 లక్షల వరకు ట్రీట్‌మెంట్ ఫ్రీ.. కేంద్రం కొత్త పథకం..

Venkatrao Lella

Images: Pinterest

07 NOV 2026

దేశంలో రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య చికిత్స అందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెలెత్తుతుంది. దీనిని నివారించడం, రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు వెంటనే వైద్య చికిత్స అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

కేంద్రం రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స అందించేందుకు పీఎం రాహత్ అనే స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడినవారు ఆస్పత్రుల్లో రూ.1.5 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు.

ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.1.5 లక్షల వరకు లేదా 7 రోజుల వరకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ ప్రయోజనాలు పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు ప్రమాద బాధితులు ఆర్ధికపరంగా ఇబ్బందులు ఎదుర్కొకూడదనే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొచ్చారు.

పీఎం రిలీఫ్ స్కీ్మ్ కింద ఈ కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు. డబ్బు లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాద బాధితులు వైద్య చికిత్సకు దూరం కాకుండా ఉండేలా చూసుకోవడమే దీని లక్ష్యం. బాధితులు సకాలంలో చికిత్స పొందేందుకు ఇది సహాయపడుతుంది.

రోడ్డు ప్రమాద బాధితులు ఆస్పత్రిలో చేరినప్పుడు ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి ఏడు రోజుల వరకు లేదా రూ.1.5 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ పొందచ్చు. నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఈ సౌకర్యం ఉంటుంది.

ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంటలో ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే 112 ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేయాలి. వెంటనే అంబులెన్స్ ప్రమాద స్థలానికి చేరుకుంటుంది.

బాధితుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్తారు. ఈ పథకంలో గుర్తించబడ్డ ఆస్పత్రిలో చేర్చడం వల్ల ఉచితంగా క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ పొందవచ్చు.

ఆర్ధిక విషయాల కారణంగా బాధితుడికి ఆస్పత్రులు ట్రీట్ మెంట్ చేయడానికి వెనకడతాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఆస్పత్రులు ఆర్ధిక విషయాల గురించి ఆలోచించకుండా వెంటనే బాధితుడికి చికిత్స అందిస్తాయి.

ఆర్ధిక అడ్డంకిని తొలగించడం, ఆస్పత్రులు వైద్య చికత్స వెంటనే అందించేలా ప్రోత్సహించేందుకు పీఎం రహత్ స్కీమ్ ఉపయోగపడుతుంది. దీని వల్ల బాధితుడి ప్రాణాలను కాపాడవచ్చు.