Indian Railways: మన దేశంలో ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్నారా? వీసా, పాస్‌పోర్ట్ ఉంటేనే ప్రయాణం!
Indian Railways: ఈ స్టేషన్ ప్రాంగణం మొత్తం బీఎస్ఎఫ్ జవాన్లతో, కేంద్ర నిఘా విభాగాల నిరంతర నిఘా నీడలో ఉంటుంది. అయితే 2019 ఆగస్టులో పాక్, భారత్ దేశాల మధ్య ఏర్పడిన దౌత్యపరమైన ఉద్రిక్తతల వల్ల సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు ఆగిపోయాయి..

Indian Railways: భారతదేశంలో మనం ఎక్కడికైనా రైలులో ప్రయాణించాలంటే సాధారణంగా టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ, మన దేశంలో ఒకే ఒక రైల్వే స్టేషన్ ఉంది.. అక్కడ అడుగుపెట్టాలంటే కేవలం రైలు టికెట్ మాత్రమే కాకుండా, పాస్‌పోర్ట్, వీసా ఉండటం తప్పనిసరి. ఆ ఆసక్తికరమైన విశేషాలు ఇక్కడ చూద్దాం.
ఏ స్టేషన్ అది?:
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఉన్న ‘గెడే రైల్వే స్టేషన్’ (Gede Railway Station) భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. ఈ స్టేషన్ భారతదేశం – బంగ్లాదేశ్ సరిహద్దును కలుపుతుంది. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్‌లోని దర్శన రైల్వే స్టేషన్‌కు రైళ్లు నడుస్తాయి. ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు అంతర్జాతీయ సరిహద్దు దాటాల్సి ఉంటుంది. అందుకే ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీలు ఇక్కడే జరుగుతాయి. బంగ్లాదేశ్‌కు వెళ్లే ప్రయాణికులు, లేదా ఆ మార్గంలో ప్రయాణించే వారు కచ్చితంగా చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, వీసా కలిగి ఉండాలి. అనుమతి పత్రాలు లేని సాధారణ స్థానికులు లేదా ప్రయాణికులు ఈ సరిహద్దు ప్రాంతంలోకి లేదా స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పైకి ప్రవేశించడానికి నిబంధనలు తీవ్రంగా ఉంటాయి.
ఇప్పుడు రైల్వే సేవలు నిలిచిపోయాయి:
ఈ స్టేషన్ ప్రాంగణం మొత్తం బీఎస్ఎఫ్ జవాన్లతో, కేంద్ర నిఘా విభాగాల నిరంతర నిఘా నీడలో ఉంటుంది. అయితే 2019 ఆగస్టులో పాక్, భారత్ దేశాల మధ్య ఏర్పడిన దౌత్యపరమైన ఉద్రిక్తతల వల్ల సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు ఆగిపోయాయి. అప్పటి నుంచి అంతర్జాతీయ రైలు ప్రయాణాలు ఇక్కడ నుంచి జరగడం లేదు. ఆ ప్రాంతం సరిహద్దు కావడంతో ఇప్పటికీ అక్కడ భారీ భద్రత కొనసాగుతోంది. భారతీయ రైల్వే చరిత్రలో పాస్‌పోర్ట్, వీసా అవసరమైన ఏకైక స్టేషన్‌గా అట్టారీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇది కూడా చదవండి: Tankless Geyser: ట్యాంక్‌లెస్ గీజర్ అంటే ఏమిటి? నీటిని స్టోర్ చేయకుండానే వేడి చేస్తుంది.. కరెంట్ ఆదా కూడా!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
