Hyderabad: హైదరాబాద్‌లో 10 చోట్ల భారీ అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
Hyderabad Fire Accident: ఈ దీపావళి వేళ.. హైదరాబాద్‌లో అగ్నికీలలు అలజడి సృష్టించాయి. బాణసంచా నుంచి ఎగసిన నిప్పురవ్వలతో పలు ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. బేగంబజార్ నుంచి జీడిమెట్ల వరకు.. కోఠి నుంచి మైలార్‌దేవ్‌పల్లి వరకు.. వరుస అగ్నిప్రమాదాలు నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. రాత్రి..

Hyderabad Fire Accident: దీపావళి వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని సుమారు 10 ప్రధాన ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి. బాణసంచా నిప్పురవ్వలు, రాకెట్లు గోదాములు, దుకాణాల్లో పడటం వల్ల ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి కూడా మంటలు భారీగా ఎగిసి పడ్డాయి.
అయితే ఈ దీపావళి వేళ.. హైదరాబాద్‌లో అగ్నికీలలు అలజడి సృష్టించాయి. బాణసంచా నుంచి ఎగసిన నిప్పురవ్వలతో పలు ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. బేగంబజార్ నుంచి జీడిమెట్ల వరకు.. కోఠి నుంచి మైలార్‌దేవ్‌పల్లి వరకు.. వరుస అగ్నిప్రమాదాలు నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. రాత్రి నగరంలో దాదాపు పది చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు..! ఈ ప్రమాదాలతో ఆస్తినష్టం వాటిల్లగా.. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది.
— బేగంబజార్ కోల్సావాడిలోని ఓ భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. టపాసుల నిప్పురవ్వలు పడటంతో అక్కడ నిల్వ ఉంచిన ప్లాస్టిక్ వస్తువులకి మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మరోవైపు జీడిమెట్ల విలేజ్‌లోని ఓ స్క్రాప్ దుకాణంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. చుట్టూ నివాస ప్రాంతాలు ఉండటంతో మంటలు ఎక్కడికి వ్యాపిస్తాయోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.
కోఠిలోని జామ్‌బాగ్ ప్రాంతంలోనూ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల తీవ్రతకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.
ఇక మైలార్‌దేవ్‌పల్లిలోని పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్లాస్టిక్ గోడౌన్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లోనే పక్కనే ఉన్న ప్లైవుడ్ గోడౌన్‌కు వ్యాపించాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుంది. మంటల తీవ్రతకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మరోవైపు అదే మైలార్‌దేవ్‌పల్లిలోని ఉడంగడ్డలో మరో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఈవెంట్ సామగ్రి గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. బాణసంచా నుంచి ఎగసిన నిప్పురవ్వలు పడటంతో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
