AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు.. 36వ, 37వ జీయర్‌ పురస్కారాల ప్రదానం

Yatindra Saptati, Muchintal Celebrations: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. యతీంద్ర సప్తతి వేడుకల్లో భాగంగా జీయర్ పురస్కారాలు ప్రదానం చేయడంతో పాటు, నవంబర్ 11న 70 మంది మాతృమూర్తులకు సన్మానం, 70 మందికి సమతా పురస్కారాలు అందించనున్నారు. వేద విజ్ఞానం, ధార్మిక సేవలు, వైష్ణవ సంప్రదాయ పరిరక్షణే లక్ష్యంగా సహస్ర ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించారు.

చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు.. 36వ, 37వ జీయర్‌ పురస్కారాల ప్రదానం
70th Tirunakshatra Mahotsav
Rajashekher G
|

Updated on: Nov 08, 2026 | 8:43 PM

Share

Yatindra Saptati, Muchintal Celebrations: ముచ్చింతల్‌లో యతీంద్ర సప్తతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. లోక క్షేమం, ప్రపంచ శాంతి, దేశ రక్షణే లక్ష్యంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. యతీంద్ర సప్తతి కార్యక్రమంలో భాగంగా 36వ, 37వ జీయర్‌ పురస్కారాలను ప్రదానం చేశారు.

వేద, ద్రవిడ ప్రబంధాల్లో విశేష పాండిత్యం కలిగిన గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్యులకు 36వ జీయర్‌ పురస్కారం అందజేశారు. జైమిని సామవేదంలో విశేష ప్రావీణ్యం కలిగిన ఎన్‌. మకరభూషణం అయ్యంగార్‌కు 37వ జీయర్‌ పురస్కారం ప్రదానం చేశారు. సంస్కృత విద్య, పరిశోధన రంగాల్లో సేవలందించిన ఆచార్య కందాల వెంకట రామకృష్ణమాచార్యులకు విద్వన్మణి పురస్కారాన్ని అందించారు చిన్నజీయర్ స్వామి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు మైహోం సంస్థల చైర్మన్‌.. డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు. స్వామివారి ఆశీర్వచనాలు అందుకుని… ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు

45 ఏళ్లుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ఆధ్యాత్మిక సేవలో ఉన్నారన్నారు మైహోం సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు. 1990 నుంచి తాను కూడా వారి దగ్గర శిష్యరికంలో ఉన్నట్టు వెల్లడించారు. చిన్నజీయర్‌ స్వామి, మైహోం గ్రూపు వేరు కాదని.. తమ ప్రతీ అడుగులోనూ స్వామివారి ఆశీస్సులు ఉన్నాయన్నారు. చిన్నజీయర్‌ స్వామి స్థాపించిన సహస్ర సంస్థకు కూడా భక్తులు, ప్రజలు మద్దతును ఇవ్వాలన్నారు మైహోం సంస్థల చైర్మన్‌.. డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు.

ముచ్చింతల్‌ నుంచి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం చేస్తోన్న సేవా కార్యక్రమాలు.. భవిష్యత్‌ తరాలకు కూడా చేరాలన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి. అందుకోసమే సహస్ర పేరుతో కొత్త ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు. ఇందులో భక్తులందరూ భాగస్వామ్యులు కావాలని సూచించారు చిన్నజీయర్‌స్వామి.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల్లో పాల్గొన్నారు BRS నేతలు హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు. యతీంద్ర సప్తతి వేడుకల్లో పాల్గొని, ఆయన ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు హరీష్‌రావు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం చిన్నజీయర్‌స్వామి వారు చేస్తున్న కృషి ఎంతో గొప్పది అన్నారు హరీష్‌

12వ తేదీ వరకు ఉత్సవాలు

నవంబర్ నెల 12వ తేదీ వరకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో యతీంద్ర సప్తతి ఉత్సవాలు జరుగుతాయి. రేపు(9న) శ్రీమత్ సుందరకాండ పారాయణం… 10న మంగళ తరంగిణి కార్యక్రమం… 11న సమతా పురస్కారాల ప్రదానం జరగనున్నాయి. రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు ఆచార్య వైభవం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈనెల 11వ తేదీన దేశ సేవలో విశేష త్యాగాలు చేసిన 70 మందికి సమతా పురస్కారాలు.. సమాజ సేవకు అంకితమైన 70 మంది మాతృమూర్తులకు సన్మానం కార్యక్రమాలు జరుగుతాయి. ఇక చివరి రోజు అంటే, ఈనెల 12న శ్రీరామచంద్రుడికి సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు.

దీపావళి శుభాకాంక్షలు

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల తొలి రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనుగ్రహ భాషణం చేసిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వేదాలను రక్షించే వారిని సమాజం కాపాడుకోవాలని, వేద విజ్ఞానాన్ని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. 36వ, 37వ జీయర్ పురస్కారాల ప్రదానం సందర్భంగా మకరభూషణం అయ్యంగారు, గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 1982లో ప్రారంభించిన జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని వివరించారు. వయసుతో సంబంధం లేకుండా మానసిక ఉత్సాహంతో సేవ చేసేవారే నిజమైన యువకులని పేర్కొన్నారు.

వికాస తరంగిణి ద్వారా 56 లక్షల మంది మహిళలకు శిక్షణ, 10 లక్షల మందికిపైగా ఆరోగ్య సేవలు అందించినట్లు తెలిపారు. నేత్ర విద్యాలయం ద్వారా చూపులేని వారికి ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేయూత అందిస్తున్నామని చెప్పారు. ఈ సేవా కార్యక్రమాలకు జూపల్లి రామేశ్వరరావు, కుమారి దంపతులు అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. వేద విజ్ఞానం, సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణతో పాటు వైష్ణవ సంప్రదాయాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్ట్ సహస్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చిన్న జీయర్ స్వామి పిలుపునిచ్చారు.

వీడియో చూడండి..

Follow Us
చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు.. వైభవంగా వేడుకలు!
చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు.. వైభవంగా వేడుకలు!
Xiaomi 18 Pro, Pro Max స్పెషాలిటీస్ ఇవే
Xiaomi 18 Pro, Pro Max స్పెషాలిటీస్ ఇవే
Karbonn Rebel Pro 4G స్మార్ట్​ఫోన్​ స్పెషాలిటీస్​ ఇవే
Karbonn Rebel Pro 4G స్మార్ట్​ఫోన్​ స్పెషాలిటీస్​ ఇవే
బోర్డు మార్చడం సులువు.. తరగతి గది మారడమే అసలైన విద్యా సంస్కరణ
బోర్డు మార్చడం సులువు.. తరగతి గది మారడమే అసలైన విద్యా సంస్కరణ
రామాయణ లాగే వారణాసి కూడా.. మహేష్ మూవీ కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్
రామాయణ లాగే వారణాసి కూడా.. మహేష్ మూవీ కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్
ఇంట్లో కాదు.. స్మశానంలోనే దీపావళి వేడుకలు.. ఈ ప్రత్యేక సంప్రదాయం
ఇంట్లో కాదు.. స్మశానంలోనే దీపావళి వేడుకలు.. ఈ ప్రత్యేక సంప్రదాయం
రోజూ ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే చాలు.. శరీరంలో అద్భుత మార్పులు
రోజూ ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే చాలు.. శరీరంలో అద్భుత మార్పులు
ఇస్త్రీ పెట్టె అడుగున పేరుకున్న మురికిని తొలగించే సింపుల్‌ ట్రిక్
ఇస్త్రీ పెట్టె అడుగున పేరుకున్న మురికిని తొలగించే సింపుల్‌ ట్రిక్
ఫస్ట్ టైమ్ కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా.. అచ్చం అమ్మలాగే...
ఫస్ట్ టైమ్ కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా.. అచ్చం అమ్మలాగే...
కోహ్లీ, రూట్‌ కాదు.. అశ్విన్ ఫేవరెట్ ఐదుగురు బ్యాటర్లు వీళ్లే
కోహ్లీ, రూట్‌ కాదు.. అశ్విన్ ఫేవరెట్ ఐదుగురు బ్యాటర్లు వీళ్లే