AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.79 వేల కోట్ల రుణాలిచ్చాం.. ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 34 నెలల్లో రూ.79 వేల కోట్ల బ్యాంకు రుణాలు అందించామని, రూ.1,900 కోట్ల వడ్డీ చెల్లించామని వెల్లడించారు. ఉచిత బస్సు పథకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ, కొత్తగా 4.5 లక్షల చేయూత పింఛన్ల పంపిణీని ప్రారంభించారు.

రూ.79 వేల కోట్ల రుణాలిచ్చాం.. ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy Kodangal Tour
Shaik Madar Saheb
|

Updated on: Nov 08, 2026 | 9:20 PM

Share

పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఏమిచ్చిందో.. మూడేళ్ల కాంగ్రెస్ పాలన ఏమిచ్చిందో చర్చ పెట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా శక్తే ప్రభుత్వ శక్తి.. ఆడబిడ్డల ఆశీర్వాదమే తనకు అండ అని.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్‌లో రెండోరోజు పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. లగచర్లలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలను ఆడబిడ్డల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా 4.5 లక్షల చేయూత కొత్త పెన్షన్లను పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు ఇప్పటికే 79 వేల కోట్ల రుణాలిచ్చామన్నారు. మహిళారుణాలకు 1900 కోట్ల వడ్డీ చెల్లించామని తెలిపారు. ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

కొడంగల్‌లో రెండోరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బొంరాస్‌పేట, దుద్యాల్‌లో విద్యాసంస్థల భవనాలను, పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. దుద్యాల్‌లో ఎమ్మార్వో ఆఫీస్‌ను ప్రారంభించారు. కోస్గిలో సైన్స్ మ్యూజియం ప్రారంభించారు.

పర్సాపూర్ లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. లబ్దిదారులు గోరిపల్లి సుమిత్ర శ్రీనివాస్‌కు కొత్త బట్టలు పెట్టారు. వారితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. వారి ఇంట్లో సన్న బియ్యంతో భోజనం చేశారు. సీఎంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, దామోదర రాజనర్సింహ భోజనం చేశారు.

సోమవారం కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మూడు రోజుల పర్యటనలో భాగంగా దాదాపు 10వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

Follow Us
గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత..
గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత..
ఓటీటీలోకి వచ్చేసిన డివోషనల్ ఎమోషనల్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన డివోషనల్ ఎమోషనల్ డ్రామా..
తాజ్ మహల్ రహస్య గదిలోని చారిత్రక సంపదకు లండన్‌లో భారీ వేలం!
తాజ్ మహల్ రహస్య గదిలోని చారిత్రక సంపదకు లండన్‌లో భారీ వేలం!
ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ రోజులు.. పాండీ బజార్ జ్ఞాపకాలు..
ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ రోజులు.. పాండీ బజార్ జ్ఞాపకాలు..
పిల్లలకి పాలిచ్చే తల్లులు, జుట్టు రాలుతున్న వాళ్లు తినాల్సిన కూర
పిల్లలకి పాలిచ్చే తల్లులు, జుట్టు రాలుతున్న వాళ్లు తినాల్సిన కూర
IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..?
IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..?
చలికాలంలో సాక్స్ వేసుకుని నిద్రపోతున్నారా..? అయితే, ఇది మీ కోసమే!
చలికాలంలో సాక్స్ వేసుకుని నిద్రపోతున్నారా..? అయితే, ఇది మీ కోసమే!
రేషన్ కార్డు ఈ-కేవైసీ మొబైల్ నుంచే పూర్తి చేయడం ఎలా..?
రేషన్ కార్డు ఈ-కేవైసీ మొబైల్ నుంచే పూర్తి చేయడం ఎలా..?
మొదటి అడుగు వేయడానికి భయపడుతున్నారా? ఈ యువకుడి కథ మీకు గొప్ప పాఠం
మొదటి అడుగు వేయడానికి భయపడుతున్నారా? ఈ యువకుడి కథ మీకు గొప్ప పాఠం
ఏడిస్తే లక్ష.. ఎడవకపోతే కోటి.. సుకుమార్, అల్లు అరవింద్ ఛాలెంజ్ ..
ఏడిస్తే లక్ష.. ఎడవకపోతే కోటి.. సుకుమార్, అల్లు అరవింద్ ఛాలెంజ్ ..