Indian Railways: తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. దసరా పండక్కి సొంతూరుకెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్లల్లో..
దసరా, దీపావళి పండగలు రానున్న క్రమంలో రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ పెరగనుంది. దీంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. తాజాగా 100 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. నవంబర్ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ మార్గాల్లో ఇవి ప్రయాణించనున్నాయి.

దసరా పండుగ వచ్చిందంటే చాలు… విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు తమ సొంతూళ్లకు బయల్దేరుతారు. పండక్కి ఇంటికెళ్లే ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిక్కిరిసి ఉంటాయి. రద్దీ కారణంగా సొంతూరుకెళ్లాలనువారు ముందుగానే టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దసరా పండక్కి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏకంగా 100 స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇప్పటినుంచే వీటికి బుకింగ్స్ కూడా స్టార్ట్ చేస్తోంది. దసరా, దీపావళి పండుగలు రానున్న క్రమంలో భక్తుల రద్దీని అంచనా వేసి ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ రైళ్లు దేశంలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీని అందించనున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఈ అదనపు సర్వీసులను తిప్పనుంది.
-ఏపీ, తెలంగాణ, తమిళనాడు, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక రైళ్లు తిరగనున్నాయి. కాన్పూర్ సెంట్రల్-SMVT బెంగళూరు, కాన్పూర్ సెంట్రల్-మదురై, విశాఖపట్నం-SMVT బెంగళూరు, షాలిమార్-చర్లపల్లి మార్గాల్లో రైళ్లను ప్రవేశపెట్టారు.
-కాన్పూర్ సెంట్రల్ మరియు SMVT బెంగళూరు(04131) అక్టోబర్ 4 నుండి నవంబర్ 15 వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో SMVT బెంగళూరు- కాన్పూర్ సెంట్రల్(04132) అక్టోబర్ 7 నుండి నవంబర్ 18 వరకు ప్రతి బుధవారం సర్వీసులు అందించనుంది.
-చర్లపల్లి-నాగర్ కోయిల్(07535) ప్రత్యేక రైలు ఈనెల 25 నుంచి అక్టోబర్ 23 వరకు ప్రతీ శుక్రవారం తిరుగుతుంది. ఈ రైలు నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, చెన్నై ఎగ్మోర్, తిరుచిరాపల్లి స్టేషన్లలో ఆగనుంది
-చర్లపల్లి-శ్రీకాకుళం(07037) ట్రైన్ అక్టోబర్ 6 నుంచి నవంబర్ 24 వరకు సర్వీసులు అందించనుండగా.. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం-చర్లపల్లి(07038) రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహచలం, కొత్తవలస, విజయనగరం, చిపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి.
-ప్రయోగరాజ్-తిరునెల్వేలి(04171) రూలు ఈ నెల 19 నుంచి అక్టోబర్ వరకు ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు తిరునెల్వేలి-ప్రయోగ్ రాజ్ మధ్య సెప్టెంబర్ 21 నుంచి అక్టోంబర్ 12 వరకు సర్వీసులు అందించనుంది. మాణిక్ పూర్, సత్నా, కట్ని, జబల్ పూర్, ఇటార్సీ, నాగ్ పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్ నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, బోలార్ పేట, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, సాత్తూల్, కోవిల్ పట్టి స్టేషన్లలో ఆగుతుంది.
