AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Records: వన్డే, టెస్టుల్లో అత్యంత వేగంగా సెంచరీలు బాదిన రికార్డులు ఎవరి పేరు మీదున్నాయో తెలుసా?

క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీల రికార్డులు ఆసక్తికరంగా ఉన్నాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అభిషేక్ శర్మ 30 బంతుల్లో సెంచరీ చేసి భారత రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లో, టెస్టుల్లో బ్రెండన్ మెకల్లమ్ 54 బంతుల్లో సెంచరీలతో ప్రపంచ రికార్డులు సాధించారు.

Cricket Records: వన్డే, టెస్టుల్లో అత్యంత వేగంగా సెంచరీలు బాదిన రికార్డులు ఎవరి పేరు మీదున్నాయో తెలుసా?
Abhishek Sharma
Rakesh
|

Updated on: Sep 20, 2026 | 4:10 PM

Share

Cricket Records: క్రికెట్ ఆటలో సెంచరీ సాధించడమంటేనే ఓ గొప్ప విషయం. కానీ కేవలం కొన్ని బంతుల్లోనే సెంచరీ బాది ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం అనేది అరుదైన ప్రతిభకు నిదర్శనం. తాజాగా భారత యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో అభిషేక్ కేవలం 30 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 11 భారీ సిక్సర్ల సాయంతో 108 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ అద్భుతమైన ప్రదర్శన ద్వారా అభిషేక్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2017లో శ్రీలంకపై రోహిత్ 35 బంతుల్లో సెంచరీ సాధించగా, ఇప్పుడు ఆ రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే టీ20ల్లో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. ముఖ్యంగా టెస్టు హోదా కలిగిన దేశాల క్రికెటర్లలో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా అభిషేక్ రికార్డు సృష్టించాడు.

ఇక ఇతర ఫార్మాట్లలో అత్యంత వేగంగా సెంచరీలు సాధించిన రికార్డుల విషయానికి వస్తే వన్డే క్రికెట్‌లో సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ప్రపంచ రికార్డు ఉంది. ఆయన 2015 జనవరి 18న వెస్టిండీస్‌పై కేవలం 31 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో డివిలియర్స్ మొత్తం 149 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని విస్మయపరిచాడు. ఆ రికార్డు ఇప్పటికీ వన్డే చరిత్రలో చెక్కుచెదరలేదు.

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పేరు మీద ఉంది. ఆయన ఫిబ్రవరి 20, 2016న ఆస్ట్రేలియాతో జరిగిన క్రైస్ట్ చర్చ్ టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 54 బంతుల్లోనే అద్భుత సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లో 145 పరుగులు చేసిన మెకల్లమ్ టెస్టుల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మొత్తంగా టీ20ల్లో అభిషేక్ శర్మ, వన్డేల్లో ఏబీ డివిలియర్స్, టెస్టుల్లో బ్రెండన్ మెకల్లమ్ తమ అసాధారణ బ్యాటింగ్‌తో ఈ రికార్డులను తమ పేరు మీద లిఖించుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!
నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా..
నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా..