AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొక్కజొన్న వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే..

రోడ్డు పక్కన వేడివేడిగా కాల్చిన మొక్కజొన్న పొత్తు కనిపిస్తే చాలు.. లొట్టలేసుకుంటూ తినేస్తుంటాం కదూ? అయితే.. ఎంతో రుచికరంగా ఉండే ఈ మొక్కజొన్న అందరి ఆరోగ్యానికీ మంచిది కాదా? కొంతమంది దీనిని తింటే లేనిపోని తీవ్రమైన అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనా? ముఖ్యంగా డయాబెటిస్, గ్యాస్ సమస్యలు ఉన్నవారు మొక్కజొన్నను ఎందుకు ముట్టుకోకూడదు? వంటి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Sep 20, 2026 | 3:21 PM

Share
కాల్చిన కంకులు, ఉడకబెట్టిన గింజలు, స్వీట్ కార్న్ చాట్ ఇలా రకరకాలుగా మక్కజొన్నను జనం ఎంతో ఇష్టంగా తింటుంటారు. రుచికి రుచి, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో మొక్కజొన్న మేలైన ఆహారమే అయినప్పటికీ.. కొందరికి మాత్రం ఇది తీవ్ర అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మొక్కజొన్నకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.

1 / 5
మొక్కజొన్నలో సహజ సిద్ధమైన కార్బోహైడ్రేట్లు అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని తిన్న వెంటనే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరిగిపోతాయి. ఇది రక్తంలో షుగర్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు లేదా షుగర్ స్థాయిలు నియంత్రణలో లేనివారు మొక్కజొన్నను పరిమితంగా తీసుకోవాలి లేదా పూర్తిగా దూరం పెట్టాలి. అలాగే వీటిపై బటర్, ఉప్పు ఎక్కువగా జోడించి తినడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రంగా ప్రభావితమవుతాయి.

2 / 5
జీర్ణ సమస్యలు, ఉబ్బరం: మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. సాధారణంగా ఫైబర్ జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఇది ప్రతికూలంగా మారుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, నొప్పి, కడుపు ఉబ్బరం, పొట్ట బరువుగా అనిపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే పచ్చిగా ఉన్నవి లేదా సరిగ్గా ఉడకని మొక్కజొన్నలు తింటే జీర్ణవ్యవస్థపై భారం పడి మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునే వారు మొక్కజొన్నను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.

3 / 5
అలెర్జీ లక్షణాలు ఉంటే జాగ్రత్త: కొందరి శరీర తత్వానికి మొక్కజొన్న అస్సలు పడదు. అలాంటి వారు వీటిని తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు, దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు రావడం వంటి అలెర్జీ ప్రతిచర్యలు కనిపిస్తాయి. మొక్కజొన్న తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

4 / 5
మితంగా తింటేనే మేలు: ఏ ఆహారమైనా అమితంగా తీసుకుంటే అనర్థమే. మొక్కజొన్నను అప్పుడప్పుడు మితంగా తీసుకుంటే మేలు జరుగుతుంది కానీ, ప్రతిరోజూ అధిక మోతాదులో తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ క్రమం తప్పకుండా మందులు వాడుతున్న వారు, ఆహారంలో మొక్కజొన్నను చేర్చుకునే ముందు వైద్యుడి లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.

5 / 5
Follow Us
లక్ష్మీదేవి కటాక్షంతో ఈ రెండు రాశులవారి జీవితం మారబోతోంది

మొక్కజొన్న వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు..

వాస్తు టిప్స్ : ఇంట్లో ఈ నాలుగు వస్తువులు ఉంటే మీ పంట పండినట్లే!

దేశవ్యాప్తంగా వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు బంద్

ఏఎన్నార్ మాట కోసం ఆరోజున.. కృష్ణంరాజు..
ఏఎన్నార్ మాట కోసం ఆరోజున.. కృష్ణంరాజు..
APPSC ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టులకు నోటిఫికేషన్.. లింక్

స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు.. వీరికి పట్టింది బంగారమే

ఎంజీఎంలో భద్రత కరువు..! స్లాబ్ పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలు

'అహంకారంతో విర్రవీగితే గొప్పవారు కాలేదు.. వినయమే అలంకారం' నీతికథ

గ్యాస్ పైప్ ఎన్ని ఏళ్లకు ఒకసారి మార్చుకోవాలంటే..? కేంద్రం రూల్స్.