AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్ కొత్తదానిలా మెరవాల్సిందే..

ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లను క్లీన్ చేయడమంటే మీకు తలనొప్పిగా అనిపిస్తుందా? చీపురుతో దులిపితే ముఖం మీద, బెడ్ మీద పడే ఆ నల్లటి దుమ్మును తలచుకుని వాయిదా వేస్తున్నారా? ఇకపై ఆ తిప్పలేవీ పడక్కర్లేదు.. స్టూల్స్ ఎక్కి సర్కస్ ఫీట్లు చేయకుండా.. దుమ్ము నేల రాలకుండా, కేవలం 5 నిమిషాల్లో ఫ్యాన్‌ను కొత్తదానిలా మెరిపించే ఒక అద్భుతమైన హోమ్ హ్యాక్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్ కొత్తదానిలా మెరవాల్సిందే..
Clean Your Ceiling Fan In 5 Minutes
Krishna S
|

Updated on: Sep 20, 2026 | 3:58 PM

Share

ఇంటిని ఎంత అందంగా సర్దుకున్నా, పైన తిరిగే సీలింగ్ ఫ్యాన్లపై దుమ్ము పేరుకుపోతే ఇల్లంతా కళావిహీనంగా కనిపిస్తుంది. అయితే ఫ్యాన్లను శుభ్రం చేయడమంటే ఇంట్లో అందరికీ పెద్ద తలనొప్పే. స్టూల్ లేదా నిచ్చెన ఎక్కి, పొడవాటి చీపురుతో తుడిస్తే.. ఆ దుమ్మూధూళి అంతా కళ్లు, ముఖంపై పడటమే కాకుండా కింద ఉన్న నేలపై రాలి ఇల్లంతా మురికిగా మారుతుంది. అలర్జీ, తుమ్ములతో బాధపడేవారికైతే ఇదొక పెద్ద టాస్క్. కానీ ఇంట్లో నిరుపయోగంగా పడి ఉండే ఒక పాత వస్తువుతో.. దుమ్ము కిందపడకుండా ఐదు నిమిషాల్లో సీలింగ్ ఫ్యాన్‌ను మెరిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఆ మ్యాజిక్ వస్తువు ఏంటంటే?

దానికి కావాల్సింది మరేదో కాదు.. మీ బీరువాలో మూలనపడ్డ ఒక పాత దిండు కవర్. సాధారణంగా చీపురుతో దులిపినప్పుడు గాలికి దుమ్ము అంతా గది నలుమూలలా వ్యాపిస్తుంది. అదే దిండు కవర్‌ను ఉపయోగించినప్పుడు, ఫ్యాన్ బ్లేడ్లపై ఉన్న దుమ్ము మొత్తం ఆ కవర్ లోపలే బంధీ అయిపోయి.. కింద పడదు.

ఎలా శుభ్రం చేయాలి? సులభమైన పద్ధతి ఇదే..

క్లీనింగ్ స్ప్రే తయారీ

ముందుగా ఒక స్ప్రే బాటిల్‌లో కొద్దిగా నీళ్లు తీసుకుని, అందులో కొద్దిగా లిక్విడ్ సోప్, కొన్ని చుక్కల వెనిగర్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని పాత దిండు కవర్ లోపలి భాగం కొద్దిగా తేమగా అయ్యేలా స్ప్రే చేయండి.

బ్లేడ్‌ను కవర్ చేయండి

ఇప్పుడు సురక్షితమైన ప్రదేశంలో నిలబడి, ఫ్యాన్ రెక్క పూర్తిగా లోపలికి వెళ్లేలా దిండు కవర్‌ను తొడగండి.

లాగితే చాలు.. మురికి మాయం

దిండు కవర్ పైభాగాన్ని, కింది భాగాన్ని మీ చేతులతో బ్లేడ్‌కు అదిమిపట్టి, నెమ్మదిగా బయటకు లాగండి. దీనివల్ల బ్లేడ్‌పై పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము మొత్తం దిండు కవర్ లోపలి వైపునకు అంటుకుని.. బ్లేడ్ సరికొత్తగా మెరుస్తుంది.

అన్ని రెక్కలకూ ఇదే విధానం

మిగిలిన రెక్కలను కూడా ఇదే పద్ధతిలో శుభ్రం చేస్తే, నిమిషాల వ్యవధిలోనే ఫ్యాన్ క్లీనింగ్ పూర్తవుతుంది.

పని పూర్తయిన తర్వాత ఆ దిండు కవర్‌ను బయటకు తీసుకెళ్లి దులిపి, వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపై ప్రమాదకరంగా నిచ్చెనలెక్కడం, ఇల్లంతా దుమ్ముమయం చేసుకోవడం వంటి తిప్పలు లేకుండా ఈ స్మార్ట్ ఐడియాతో పనిని ఎంతో తేలిగ్గా చేసుకోవచ్చు.

Follow Us
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!
నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా..
నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా..
తల లేకపోయినా బతికేస్తాయి! బొద్దింకల గురించి ఈ ఆసక్తికర విషయాలు
తల లేకపోయినా బతికేస్తాయి! బొద్దింకల గురించి ఈ ఆసక్తికర విషయాలు
లక్ష్మీదేవి కటాక్షంతో ఈ రెండు రాశులవారి జీవితం మారబోతోంది
లక్ష్మీదేవి కటాక్షంతో ఈ రెండు రాశులవారి జీవితం మారబోతోంది