AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 నోట్ టేకింగ్ టెక్నిక్స్‌ మీకు తెలియాలి!

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు చదివిన విషయాలను ఎక్కువకాలం గుర్తుంచుకోవడం, అవసరమైనప్పుడు వెంటనే గుర్తు తెచ్చుకోవడం చాలా ముఖ్యం. కేవలం పుస్తకాన్ని చదవడం, ముఖ్యమైన అంశాలను హైలైట్ చేయడం మాత్రమే సరిపోదు. చదివిన సమాచారాన్ని మన మెదడు నుంచి తిరిగి గుర్తు తెచ్చుకునేలా (Active Recall) నోట్స్ తయారు చేసుకోవడం మెమరీని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది..

చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 నోట్ టేకింగ్ టెక్నిక్స్‌ మీకు తెలియాలి!
Exam Preparation Tips
Srilakshmi C
|

Updated on: Sep 20, 2026 | 3:55 PM

Share

విద్యార్థులు తమ చదువులో ఉపయోగించుకోగల ఐదు యాక్టివ్ నోట్-టేకింగ్ పద్ధతులు ఇవే..

కార్నెల్ మెథడ్: నోట్స్‌తో పాటు రీకాల్

కార్నెల్ పద్ధతిలో ప్రతి పేజీని మూడు భాగాలుగా విభజించాలి. ఎడమవైపు చిన్న కాలమ్‌ను ప్రశ్నలు లేదా ముఖ్యమైన సూచనల కోసం, కుడివైపు పెద్ద భాగాన్ని అసలు నోట్స్ కోసం ఉపయోగించాలి. పేజీ దిగువన సారాంశం రాయాలి. చదివేటప్పుడు, క్లాస్ సమయంలో కుడివైపు నోట్స్ రాసుకోవాలి. సెషన్ పూర్తయిన తర్వాత ఆ నోట్స్‌ను మూసివేసి, ఎడమవైపు వాటికి ప్రశ్నలను రాయాలి. చివరగా మొత్తం విషయాన్ని గుర్తు చేసుకుని షార్ట్‌గా రెండు వాక్యాల్లో సారాంశంగా రాయాలి. ముఖ్యమైన విషయం.. కార్నెల్ పద్ధతిలో ప్రశ్నల కాలమ్ కీలకం. కేవలం పేజీని మూడు భాగాలుగా విభజించడం వల్ల మాత్రమే ప్రయోజనం ఉండదు.

ఫెయిన్‌మన్ టెక్నిక్: అర్థమయ్యే వరకు సులభంగా వివరించండి

ఏదైనా అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నామో? లేదో? తెలుసుకోవడానికి ఫెయిన్‌మన్ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఒక కాన్సెప్ట్‌ను ఎంచుకుని, దాన్ని ఏమీ తెలియని వ్యక్తికి వివరిస్తున్నట్లుగా చాలా సులభమైన భాషలో రాయాలి. ఎక్కడైనా వివరణ ఆగిపోతే, క్లిష్టమైన పదజాలాన్ని ఆశ్రయించాల్సి వస్తే లేదా విషయం స్పష్టంగా చెప్పలేకపోతే అక్కడే మనకు ఉన్న అవగాహన లోపాన్ని గుర్తించవచ్చు. ఆ భాగాన్ని మాత్రమే మళ్లీ పుస్తకంలో చదివి, తర్వాత మరోసారి సులభమైన భాషలో వివరించాలి. పోటీ పరీక్షలకు ఉపయోగం UPSC, APPSC, TSPSC, NEET, JEE వంటి పరీక్షల్లో క్లిష్టమైన కాన్సెప్టులను అర్థం చేసుకుని గుర్తుంచుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

మైండ్ మ్యాపింగ్: విషయాల మధ్య సంబంధాలను గుర్తించండి

మైండ్ మ్యాప్‌లో మధ్యలో ప్రధాన అంశాన్ని రాసి, అక్కడి నుంచి ఉప అంశాలు, వాటి వివరాలు, వాటి మధ్య సంబంధాలను శాఖలుగా చూపిస్తారు. ఇది ముఖ్యంగా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న అంశాలను చదివేటప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు ఇండియన్ పాలిటీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ వంటి విషయాల్లో వివిధ అంశాల మధ్య సంబంధాలను గుర్తించడానికి మైండ్ మ్యాప్స్ సహాయపడతాయి. మైండ్ మ్యాప్ తయారు చేయడమే ఒక రకమైన యాక్టివ్ స్టడీ. అందువల్ల వీలైతే పెన్, పేపర్‌తో చేతితో మైండ్ మ్యాప్ తయారు చేయడం ద్వారా చదువుతున్న అంశాలను విజువల్‌గా గుర్తుంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అవుట్‌లైన్ మెథడ్: నోట్స్‌ను క్రమంగా కుదించండి

సాధారణంగా విద్యార్థులు మెయిన్ పాయింట్, సబ్ పాయింట్, వివరాలు అనే క్రమంలో అవుట్‌లైన్ నోట్స్ తయారు చేస్తారు. అయితే ప్రతి చిన్న వివరాన్ని నోట్స్‌లో చేర్చడం వల్ల ముఖ్యమైన అంశాలు ఏవో గుర్తించడం కష్టమవుతుంది. దీనికి పరిష్కారం Deliberate Compression. మొదట పూర్తి అవుట్‌లైన్ తయారు చేయాలి. తర్వాత పుస్తకాన్ని మూసివేసి, అదే విషయాన్ని సగం పరిమాణంలో మళ్లీ రాయాలి. ఆ తర్వాత మరోసారి సగానికి కుదించాలి. ఈ ప్రక్రియలో ఏది ముఖ్యమో, ఏది వదిలేయవచ్చో నిర్ణయించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 12 పేజీల NCERT అధ్యాయాన్ని క్రమంగా కుదిస్తూ చివరికి ఒక పేజీ ముఖ్యాంశాలుగా మార్చుకోవచ్చు. ఆ ఒక్క పేజీ రివిజన్ సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రశ్న-ముందుగా పద్ధతి: చదవకముందే ప్రశ్నలు తయారు చేసుకోండి

ఒక అధ్యాయాన్ని చదవడం ప్రారంభించే ముందు, ఈ అధ్యాయం నుంచి నాకు ఏ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి? అని ఆలోచించి ప్రశ్నల జాబితా తయారు చేసుకోవాలి. చదివిన తర్వాత ఆ ప్రశ్నల్లో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయో పరిశీలించాలి. సమాధానం లేని ప్రశ్నలను ప్రత్యేకంగా గుర్తించాలి. ఇలా చేయడం వల్ల చదువు ఒక పాసివ్ ప్రక్రియగా కాకుండా ఒక పరీక్షలా మారుతుంది. చదవడానికి ముందే తయారు చేసుకున్న ప్రశ్నలు తర్వాత మొదటి రివిజన్ మెటీరియల్‌గా కూడా ఉపయోగపడతాయి.

హైలైటింగ్ కంటే యాక్టివ్ రీకాల్ ఎందుకు ముఖ్యం..?

ఈ ఐదు పద్ధతుల్లో ఒకే ముఖ్యమైన సూత్రం కనిపిస్తుంది. సమాచారాన్ని కేవలం చదవడం లేదా హైలైట్ చేయడం కాకుండా, దానితో మెదడు ఏదో ఒక పని చేయాలి. ప్రశ్నలు తయారు చేయడం, సమాధానాలను గుర్తు నుంచి రాయడం, కాన్సెప్ట్‌ను సులభంగా వివరించడం, నోట్స్‌ను కుదించడం, అంశాల మధ్య సంబంధాలను చూపించడం వంటి కార్యకలాపాలు మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి. అందుకే పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు “ఎంతసేపు చదివాను?” అనే దానికంటే “చదివినదాన్ని పుస్తకం చూడకుండా ఎంతవరకు గుర్తు చేసుకోగలుగుతున్నాను?” అనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

చదవడం.. పుస్తకం మూసివేయడం.. గుర్తు చేసుకోవడం.. తప్పులను గుర్తించడం.. మళ్లీ చదవడం.. తిరిగి రీకాల్ చేయడం అనే మెథడ్‌ రోజువారీ చదువులో భాగం చేసుకుంటే రివిజన్ మరింత ప్రభావవంతంగా మారుతుంది.

Follow Us
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం