భర్త కోసం రిస్క్ చేసింది.. ఇప్పుడు నయనతార సంచలన నిర్ణయం..

Rajitha Chanti

Pic credit - Instagram

20 September 2026

దక్షిణాది చిత్రసీమలో 'లేడీ సూపర్ స్టార్'గా చెరిగిపోని ముద్ర వేసుకున్న నటి నయనతార. ఇప్పటికీ మోస్ట్ బిజీ హీరోయిన్.

నయనతార. 

ప్రతి  సినిమాకు రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ  అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటి ఆమె. 

నయనతార. 

కథానాయికగా  బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న నయన్, తెరవెనుక నిర్మాతగా మాత్రం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నయనతార. 

నటిగా సంపాదించిన కోట్ల రూపాయలను సినిమా నిర్మాణంలో పెట్టి దారుణంగా నష్టపోవడంతో, ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నయనతార. 

భర్త విగ్నేష్ శివన్‌తో కలసి స్థాపించిన ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించినప్పటికీ, సరైన ఫలితాలు దక్కలేదు.

నయనతార. 

భర్తను దర్శకుడిగా ప్రోత్సహించేందుకు , ఇతర చిత్రాలపై భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ, అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

నయనతార. 

ఇటీవల నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'హాయి' అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.

నయనతార. 

ఇకపై నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ తన పూర్తి సమయాన్ని, దృష్టిని నటనపైనే కేంద్రీకరించాలని లేడీ సూపర్ స్టార్ నిర్ణయించుకున్నట్లు ఫిలింనగర్ టాక్.

నయనతార.