AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రోజే నా కథ ముగిసిందనుకున్నా.. సంచలన విషయం బయటపెట్టిన అజిత్ దోవల్!

భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే రెండు దశాబ్దాల్లో భారీగా విస్తరించే అవకాశం ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. సెప్టెంబర్ 19న ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం సుమారు 4.015 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత GDP వచ్చే 20 ఏళ్లలో 38 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొన్నారు.

ఆ రోజే నా కథ ముగిసిందనుకున్నా.. సంచలన విషయం బయటపెట్టిన అజిత్ దోవల్!
Ajit Doval Iit Roorkee
Balaraju Goud
|

Updated on: Sep 19, 2026 | 10:47 PM

Share

భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే రెండు దశాబ్దాల్లో భారీగా విస్తరించే అవకాశం ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. సెప్టెంబర్ 19న ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం సుమారు 4.015 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత GDP వచ్చే 20 ఏళ్లలో 38 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొన్నారు.

భారత్ ప్రస్తుతం కీలకమైన పరివర్తన దశలో ఉందని అజిత్ దోవల్ చెప్పారు. 2047 వరకు ఉన్న కాలాన్ని ‘అమృత్ కాల్’గా పేర్కొంటూ.. దేశంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, భవిష్యత్తులో యువతకు విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇలాంటి మార్పుల సమయంలో విద్యను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంతో పాటు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.

ధైర్యంగా ముందుకు వెళ్లాలిః దోవల్

విద్యార్థులు తమ జీవితంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని అజిత్ దోవల్ సూచించారు. ఇందుకు శ్రీరాముడి ఉదాహరణను ప్రస్తావించారు. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కారణంగానే విశ్వామిత్రుడు శ్రీరాముడిని ఎంచుకున్నారని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచిస్తూ, కొత్త అవకాశాలను స్వీకరించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తన కెరీర్ తొలినాళ్లలో సిక్కింలో పనిచేసిన సమయంలో ఓ షెర్పా నుంచి నేర్చుకున్న మూడు విషయాలను కూడా దోవల్ విద్యార్థులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కెరీర్ స్టార్టింగ్‎లో జరిగిన సంచలన విషయాన్ని బయటపెట్టారు. ‘‘20 ఏళ్ల వయసులో స్పైగా కెరీర్ ప్రారంభించానన్న ఆయన.. తొలుత సిక్కింలో ఇంటెలిజెన్స్ ఇన్‌చార్జ్‌గా నియమించారని తెలిపారు. సిక్కిం అప్పటికీ భారతదేశంలో భాగంగా లేదు. భారతదేశంలో విలీనంపై చర్చలు జరగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాలపై నిఘా ఉంచడం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) కదలికలు, కార్యకలాపాల గురించి సమాచారం సేకరించడం నా పని అని దోవల్ వివరించారు.

‘‘ ఒక మిషన్‎లో భాగంగా సమాచార సేకరణ కోసం సరిహద్దు ప్రాంతానికి టీమ్‎ను పంపించా. టీమ్ సరిహద్దు దాటి చైనా సైన్యానికి దొరికిపోయినట్లు తెలిసింది. సుదీర్ఘ విచారణ, తీవ్ర ఒత్తిళ్ల అనంతరం చైనా టీమ్ సభ్యులను రిలీజ్ చేసింది. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. దీంతో నా కెరీర్ క్లోజ్ అయ్యిందనుకున్నా. అయితే అధికారిక విచారణలో తమకు అందిన మ్యాపులు, రూట్ స్కెచ్లలో తీవ్ర లోపాలు ఉన్నట్లు తేలింది. తప్పుడు మ్యాపుల కారణంగానే తమ ఏజెంట్లు దారి తప్పి చైనా భూభాగంలోకి ప్రవేశించారని నిర్ధారణ కావడంతో తనకు క్లీన్ చిట్ లభించింది. ఈ ఘటనతో తాను తీవ్ర ఆందోళనకు, అధైర్యానికి గురయ్యా’’ అని దోవల్ విద్యార్థులతో పంచుకున్నారు.

షెర్పా చెప్పిన మూడు విజయ సూత్రాలు:

మొదటిది.. మ్యాప్‌లో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడం.

రెండోది.. మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామో స్పష్టంగా నిర్ణయించుకోవడం.

మూడోది.. గమ్యాన్ని చేరేందుకు సరైన మార్గాన్ని తెలుసుకోవడంతో పాటు, అవసరమైతే తిరిగి వచ్చే మార్గాన్ని కూడా తెలుసుకోవడం.

లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుత పరిస్థితిపై అవగాహన, స్పష్టమైన గమ్యం, సరైన ప్రణాళిక అవసరమని ఈ మూడు సూత్రాలు సూచిస్తున్నాయని అజిత్ దోవల్ వివరించారు. ఐఐటీ రూర్కీ 2026 స్నాతకోత్సవం సెప్టెంబర్ 19, 20 తేదీల్లో జరుగుతోంది. రెండు రోజుల కార్యక్రమంలో మొత్తం 2,701 మంది విద్యార్థులు డిగ్రీలు అందజేస్తున్నారు. ఈ పట్టభద్రులలో 1,001 మంది పురుష విద్యార్థులు మరియు 276 మంది మహిళా విద్యార్థులు ఉన్నారు. ఇది సంస్థ చరిత్రలో ఒకే స్నాతకోత్సవంలో అత్యధిక సంఖ్య. ఈ కార్యక్రమానికి అజిత్ దోవల్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ , సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శి జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి గౌరవ అతిథిగా విచ్చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
అమెరికా వెళ్తున్నారా..? విమానాశ్రయంలో మీ ఫోన్లు చెక్‌ చేయొచ్చు!
అమెరికా వెళ్తున్నారా..? విమానాశ్రయంలో మీ ఫోన్లు చెక్‌ చేయొచ్చు!