అమెరికాలో జరిగిన కూతురి పెళ్లిని వీసా సమస్యల వల్ల ప్రత్యక్షంగా చూడలేకపోయిన సూర్యాపేట జిల్లా దంపతులు జయరాజు, జ్యోతి టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. హుజూర్ నగర్లోని తమ ఇంటి నుండి వీడియో కాల్ ద్వారా కుమార్తె హిమబిందు పెళ్లి వేడుకను వీక్షించి, ఆన్లైన్లో దీవించారు. ఈ ప్రత్యేక క్షణాలను ఆనందంగా పంచుకున్నారు.