హిమాలయాల్లోని నున్కున్ పర్వత ప్రాంతాల్లో 18,600 అడుగుల ఎత్తులో ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని భారత పైలట్లు సాహసోపేతంగా కాపాడారు. ల్యాండింగ్ స్థలం లేకపోవడంతో ఒకే స్కిడ్పై హెలికాప్టర్‌ను నిలిపి అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రతికూల వాతావరణంలో చేపట్టిన ఈ రెస్క్యూ మిషన్ సరికొత్త రికార్డును నెలకొల్పింది.