Poorna: ‘పూర్ణ నాకు తల్లి లాంటివారు.. వచ్చే జన్మలో ఆమె కడుపున పుట్టాలనుకుంటున్నా’: ప్రముఖ డైరెక్టర్

ప్రముఖ నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన ఈ అందాల తార ఇప్పుడు స్పెషల్‌ రోల్స్‌తో అలరిస్తోంది. అలాగే ఢీ వంటి డ్యాన్స్‌ రియాల్టీషోల్లోనూ జడ్జిగా బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇటీవల మహేశ్‌ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోనూ తళుక్కున మెరిసిందీ అందాల తార.

Poorna: 'పూర్ణ నాకు తల్లి లాంటివారు.. వచ్చే జన్మలో ఆమె కడుపున పుట్టాలనుకుంటున్నా': ప్రముఖ డైరెక్టర్
Actress Poorna
Follow us
Basha Shek

|

Updated on: Jan 27, 2024 | 12:26 PM

ప్రముఖ నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన ఈ అందాల తార ఇప్పుడు స్పెషల్‌ రోల్స్‌తో అలరిస్తోంది. అలాగే ఢీ వంటి డ్యాన్స్‌ రియాల్టీషోల్లోనూ జడ్జిగా బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇటీవల మహేశ్‌ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోనూ తళుక్కున మెరిసిందీ అందాల తార. కుర్చీ మడత పెట్టి సాంగ్‌లో కాసేపు స్టెప్పులేసి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది. పూర్ణ ప్రధాన పాత్రలో కోలీవుడ్‌ దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన చిత్రం డెవిల్‌. విదార్థ్‌, పూర్ణ, అరుణ్‌, మిష్కిన్‌ ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రముఖ నటుడు, దర్శకుడు మిస్కిన్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించడం విశేషం. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న డెవిల్‌ ఫిబ్రవరి 2న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా మాట్లాడిన మిస్కిన్‌ నటి పూర్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘డెవిల్‌ చిత్రంలో పూర్ణ అద్భుతంగా నటించారు. అయితే తమ మధ్య ఏదో ఉందని కొందరు పుకార్లు పుట్టించడం బాధ కలిగించింది. ఆమె నాకు తల్లిలాంటి వారు. వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుట్టాలని కోరుకుంటున్నాను ‘ అని మిస్కిన్‌ చెప్పడంతో స్టేజ్‌పైనే ఉన్న పూర్ణ ఎమోషనల్‌ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదే సందర్భంగా మాట్లాడిన పూర్ణ.. ‘ ‘డెవిల్‌ నాకు కేవలం సినిమా మాత్రమే కాదు. నా జీవితానికి రిలేట్‌ అయిన ఒక ఎమోషన్‌ ‘ అన్నారు.

ఇవి కూడా చదవండి

 గుంటూరు కారం సెట్ లో  మహేశ్ బాబుతో నటి పూర్ణ..

భర్త, కుమారుడితో నటి పూర్ణ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.