AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Little Miss Naina OTT: పొట్టి పిల్ల, పొడుగబ్బాయి ప్రేమకథ.. ఓటీటీలోకి వచ్చేసిన లిటిల్‌ మిస్‌ నైనా.. ఎందులోనంటే?

త‌మిళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన 96 సినిమాతో బాగా ఫేమస్‌ అయిపోయింది గౌరీ కిషన్. ఇందులో త్రిష చిన్ననాటి ప్రేమకథా సన్నివేశాల్లో ఎంతో అద్భుతంగా నటించింది. 96 తెలుగు వెర్షన్‌ జానులోనూ గౌరీ కిషన్‌ నటించి మెప్పించింది

Little Miss Naina OTT: పొట్టి పిల్ల, పొడుగబ్బాయి ప్రేమకథ.. ఓటీటీలోకి వచ్చేసిన లిటిల్‌ మిస్‌ నైనా.. ఎందులోనంటే?
Little Miss Naina Movie
Basha Shek
| Edited By: TV9 Telugu|

Updated on: Jan 25, 2024 | 5:20 PM

Share

త‌మిళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన 96 సినిమాతో బాగా ఫేమస్‌ అయిపోయింది గౌరీ కిషన్. ఇందులో త్రిష చిన్ననాటి ప్రేమకథా సన్నివేశాల్లో ఎంతో అద్భుతంగా నటించింది. 96 తెలుగు వెర్షన్‌ జానులోనూ గౌరీ కిషన్‌ నటించి మెప్పించింది. ఇక గతేడాది మెగాస్టార్‌ చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించిన శ్రీదేవి శోభ‌న్ బాబు మూవీతో హీరోయిన్‌గా కూడా పరిచయమైందీ అందాల తార. సంతోష్ శోభ‌న్ హీరో. ఇందులో గౌరి కిషన్‌ అందం, అభినయానికి మంచి పేరొచ్చింది. అయితే సినిమా సక్సెస్‌ కాకపోవడంతో రేస్‌లో కాస్త వెనకబడింది గౌరి కిషన్‌. ఇదిలా ఉంటే మలయాళంలో గౌరీ జి కిషన్‌ నటించిన లేటెస్ట్‌సినిమా లిటిల్‌ మిస్‌ రాథర్‌’. షేర్షా షరీఫ్‌ హీరోగా నటించాడు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ ప్రేమకథ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లిటిల్ మిస్ నైనా పేరుతో నేరుగా ఓటీటీలో రిలీజైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

విష్ణుదేవ్ ద‌ర్శ‌క‌త్వం వహించిన లిటిల్ మిస్ నైనా మూవీలో నిఖితా థెరిసా, సంగీత్‌ ప్రతాప్‌ కీలక పాత్రలు పోషించారు. . 96 ఫేమ్ గోవింద్ వసంత లిటిల్ మిస్ నైనాకు కూడా అందమైన పాటలను అందిం,ఆడే . ల్యూక్ జోస్ కెమెరా, సంగీత్ ప్రతాప్ ఎడిటింగ్, సుతిన్ సుగతన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక లిటిల్‌ మిస్‌ నైనా సినిమా కథ విషయానికొస్తే.. నైనా పొట్టిగా (4 అడుగులు), అభిజిత్ పొడవుగా (6 అడుగులు) ఉంటారు. అభిజిత్‌కి సినిమా అంటే పిచ్చి. అదే సమయంలో ఓసీడీతోసమస్య ఉన్న నైనాకు చదువంటే ప్రాణం. మరి పొట్టిగా ఉన్ననైనా రాథర్‌, పొడవైన వ్యక్తి అభిజిత్‌ చంద్రదాస్‌ మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ప్రేమలో పడ్డాక వీళ్లిద్దరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనేది ఈ సినిమాలో ఫన్నీగా చూపించారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.