AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ టూ గోవా.. కేవలం 8 గంటల్లోనే.. గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ నుంచి గోవాకు టూరిస్టులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 18 గంటల వరకు సమయం పడుతుంది. రానున్న రోజుల్లో ఈ ప్రయాణ సమయం సగానికి సగం తగ్గనుంది. దీనికి కారణం గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పవచ్చు.

Hyderabad: హైదరాబాద్ టూ గోవా.. కేవలం 8 గంటల్లోనే.. గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్
Goa
Venkatrao Lella
|

Updated on: Feb 22, 2026 | 9:37 PM

Share

హైదరాబాద్ నుంచి గోవాకు ఇక కేవలం 8 గంటల్లోనే చేరుకోవచ్చు. అవును.. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో గోవాకు చేరుకోవాలంటే 15 నుంచి 18 గంటల సమయం పడుతుంది. కానీ గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే కేవలం 8 గంటల్లోనే చేరుకోవచ్చన్నమాట. ప్రయాణ సమయం సగానికి సగం తగ్గనుంది. ఈ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. భారత్ మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు సిద్దమైంది. ఇప్పటికే భూసేకరణ పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే బెలగావి-రాయచూర్ మధ్య భూసేకరణ పనులు పూర్తవ్వగా.. సివిల్ పనులు కూడా మొదలయ్యాయి.

గోవా వెళ్లేవారికి తగ్గనున్న సమయం

హైదరాబాద్ నుంచి గోవాకు వేలమంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు. గోవాలోని బీచ్‌లు, అక్కడి సందర్శనీయ ప్రాంతాలను చూసేందుకు వెళ్తుంటారు. ప్రస్తుతం రైల్వే, విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక రోడ్డు మార్గంలో వెళ్లే సౌకర్యం ఉన్నా ఎక్కువ సమయం పడుతుంది. దీంతో పాటు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎకనామిక్-10 కారిడార్ నిర్మించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. పనాజీ-బెలగావి-రాయచూరు-హైదరాబాద్ మార్గంలో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఉండనుంది. ప్రస్తుతం పనాజీ-హుబ్లీ- కొప్పల్-రాయచూర్-మహబూబ్ నగర్-హైదరాబాద్ మార్గంలో హైవే ఉండగా.. దీనికి ప్రత్యామ్నాయంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు.

రూ.12 వేల కోట్లతో ప్రాజెక్ట్

రూ.12 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇది పూర్తయితే తెలంగాణ నుంచి గోవా, కర్ణాటకకు కనెక్టివిటీ మరింత పెరగనుంది. మొత్తం నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్డును ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. హ్యమ్ విధానంలో దీనిని నిర్మిస్తుండగా.. ఈ కారిడార్ వల్ల సరుకు రవాణా మెరుగవ్వడంతో పాటు పర్యాటకం, రవాణా మెరుగుపడనుంది. హైదరాబాద్-గోవా మధ్య ప్రస్తుతం 700 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే కంప్లీట్ అయితే 150 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. దీని వల్ల సురుకు వేగవంతంగా రవాణా అవుతుందని, దీని వల్ల మరిన్ని పరిశ్రమలు వస్తాయని కేంద్రం చెబుతోంది.

Follow Us