AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: రేవంత్‌ అండ్ కిషన్‌..! మధ్యలో మెట్రో రైల్.. ఎవరి ఎత్తుగడలు వాళ్లవే

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అంశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో కలిసి మెట్రో ప్రాజెక్టుపై చర్చించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్-బీజేపీ మధ్య అవగాహన రాజకీయాలు నడుస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిసి పనిచేస్తున్నామని ఇరు పార్టీలు చెబుతున్నాయి. మెట్రో నుంచి సింగరేణి వరకు వివిధ అంశాలపై మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కుతోంది.

Telangana Politics: రేవంత్‌ అండ్ కిషన్‌..! మధ్యలో మెట్రో రైల్.. ఎవరి ఎత్తుగడలు వాళ్లవే
Telangana Politics
Shaik Madar Saheb
|

Updated on: Jun 24, 2026 | 9:50 PM

Share

2024 డిసెంబర్ 12.. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి, కేంద్రమంత్రి కుర్చీలో ఉన్న కిషన్‌రెడ్డిని కలిసి, శాలువా కప్పి, సన్మానించి, విన్నపాలు వినిపించిన సందర్భం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ కోసం లక్షా 60 వేల కోట్లు కావాలని ఆయన పెట్టుకున్న రిక్వెస్ట్ కంటే వాళ్లిద్దరూ తీసుకున్న గ్రూప్ ఫోటోనే అప్పట్లో బాగా వైరలైంది. రాష్ట్ర ప్రయోజనాలా రాజకీయ ప్రయోజనాలా అని డౌట్లతో కామెంట్ బాక్సులు నిండిపోయాయి. చాలా గ్యాప్ తర్వాత తెలంగాణాలో బీ-టీమ్ పాలిటిక్స్ అనే సబ్జెక్ట్ కూడా తెరమీదికొచ్చేసింది. అది ప్రభుత్వాలు ఏర్పాటైన కొత్త రోజుల్లో ముచ్చటని, సత్సంబంధాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆడిన అలయ్‌బలయ్ అని లైట్ తీస్కుంది ఉమ్మడి అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్. ఏడాదిన్నర గడిచింది. మళ్లీ అటువంటిదే ఢిల్లీ నుంచి ఇంకో గ్రూప్ ఫోటో. కారు పార్టీకి మాంచి స్టఫ్ఫు దొరికినట్టయింది. తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ కొత్త టర్న్ తీసుకున్నట్టేనా? తెలంగాణలో సద్దుమణిగినట్టే సద్దుమణిగి, మళ్లీ సలసలా కాగుతోంది రాజకీయం. మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం మంటలు పుట్టిస్తోంది. మొన్నటిదాకా ధాన్యం అమ్మకాలు, సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ చెలరేగి, నోర్లింత చేసుకున్న లీడర్లు ఇప్పుడు కొత్త సబ్జెక్ట్‌లోకి దూరిపోయారు. రేవంత్‌రెడ్డి అండ్ కిషన్‌రెడ్డి.. మధ్యలో మెట్రో రైల్. ఇదీ సబ్జెక్ట్. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విషయంలో పొట్టుపొట్టు తిట్టుకుని బ్లేమ్‌గేమ్ ఆడుకున్న ఇద్దరు నేతలూ సడన్‌గా ఢిల్లీలో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని సింగిల్ ఫ్రేమ్‌లో...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి