- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss 7 Telugu Shobha Shetty fulfills her longtime dream by buying new house
Shobha Shetty: అయోధ్య రామోత్సవం రోజే కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి.. ఫొటోస్ చూశారా?
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌తో బాగా పాపురల్ అయిన వాళ్లలో కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి ముందుంటుంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ హౌజ్‌లో ఎంతో డేరింగ్ అండ్ డ్యాషింగ్‌గా వ్యవహరించింది. అయితే అది చాలామందికి నచ్చకపోగా నెగెటివిటీని తెచ్చిపెట్టింది.
Updated on: Jan 25, 2024 | 4:02 PM

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌తో బాగా పాపురల్ అయిన వాళ్లలో కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి ముందుంటుంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ హౌజ్‌లో ఎంతో డేరింగ్ అండ్ డ్యాషింగ్‌గా వ్యవహరించింది. అయితే అది చాలామందికి నచ్చకపోగా నెగెటివిటీని తెచ్చిపెట్టింది.

సీరియల్ బ్యాచ్‌లో భాగమైన శోభా శెట్టి స్పై (శివాజీ, పల్లవి ప్రశాంత్ , యావర్) బ్యాచ్‌తో సై అంటే సై అంది. ఆమె ఆటతీరు చూసి గ్రాండ్ ఫినాలేకు వెళుతుందని భావించారు. అయితే అదేమీ జరగలేదు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన పర్సనల్ లైఫ్‌పై బాగా దృష్టి సారించింది శోభ. ఇందులో భాగంగా తన ప్రియుడు యశ్వంత్‌తో ఎంగేజ్‌మెంట్ జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది.

తాజాగా మరో శుభవార్త చెప్పింది శోభ. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నతన కల ఇప్పుడు సాకారమైందని, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజు(జనవరి 22న) కొత్తింటి తాళం తన చేతికొచ్చిందని తెలిపిందీ అందాల తార.

అయితే బిగ్‌బాస్ ఇచ్చిన డబ్బులతో ఈ ఇల్లు తీసుకోలేదని, రెండేళ్ల క్రితమే దీన్ని కొనుగోలు చేశామని తెలిపింది శోభ. ప్రియుడితో కొత్తింటిలో ఆమె దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.