AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఊర్లో మేడ ఉంటే ఒట్టు.. ఎందుకో తెలిస్తే షాక్..! మేడ లేని ఆ ఊరు ఎక్కడుందంటే..?

Peddahothur: కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతురులో అన్ని కులాల వారు హుచ్చు వీరప్ప తాతను భక్తితో పూజిస్తారు. ఆ గ్రామ కట్టుబాటు మేరకు తాత ఆలయం ఎత్తును మించి ఇళ్ల నిర్మాణలు చేపట్టరు. అందుకు కారణం వంద ఏళ్ల క్రితం ఆ గ్రామంలో ఒక భూస్వామి.. ఆ ఆలయం ఎత్తును మించి ఇల్లు నిర్మాణం చేసే సమయంలోనే వారి కుటుంబలో ఏదో ఒక ఊహించని సంఘటన జరిగిందని ప్రచారం. అంతేగాక, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఊరు వదిలి వెళ్లరాని తెలిసింది. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఏ ఒక్కరు మేడలు కట్టరు. అందుకు ఆ గ్రామానికి మేడ లేని ఊరు అని పిలుస్తారు.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 11:46 AM

Share
ధనవంతులైనా.. వంద ఎకరాల భూమి ఉన్న రైతులు అయినా.. ఆ ఊరిలో మేడలు కట్టరు. అందుకు కారణం.. ఆ గ్రామ ప్రజలు ఆరాధ్య  దైవంగా పూజించే హుచ్చువీరప్ప తాత ఆలయం. ఆ ఆలయం ఎత్తును మించి ఇల్లు కట్టకూడదనే ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అరుదైన ఆ ఊరు ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతురు.

1 / 6
కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతురులో అన్ని కులాల వారు హుచ్చు వీరప్ప తాతను భక్తితో పూజిస్తారు. ఆ గ్రామ కట్టుబాటు మేరకు తాత ఆలయం ఎత్తును మించి ఇళ్ల నిర్మాణలు చేపట్టరు.

కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతురులో అన్ని కులాల వారు హుచ్చు వీరప్ప తాతను భక్తితో పూజిస్తారు. ఆ గ్రామ కట్టుబాటు మేరకు తాత ఆలయం ఎత్తును మించి ఇళ్ల నిర్మాణలు చేపట్టరు.

2 / 6
అందుకు కారణం వంద ఏళ్ల క్రితం  ఆ గ్రామంలో ఒక భూస్వామి.. ఆ ఆలయం ఎత్తును మించి ఇల్లు నిర్మాణం చేసే సమయంలోనే వారి కుటుంబలో ఏదో ఒక ఊహించని సంఘటన జరిగిందని ప్రచారం. అంతేగాక, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఊరు వదిలి వెళ్లరాని తెలిసింది. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఏ ఒక్కరు మేడలు కట్టరు. అందుకు ఆ  గ్రామానికి మేడ లేని ఊరు అని పిలుస్తారు.

3 / 6

అందరికి ఆవే పేర్లు..

ఆ గ్రామంలో భక్తి శ్రద్ధలతో పూజించే హుచ్చు వీరప్ప తాత పేరు ఎక్కువగా ఉంటాయి. పెద్ద హుచ్చురప్ప.. చిన్న హుచ్చురప్ప.. పెద్ద హుచురమ్మ.. చిన్న హుచ్చురమ్మ.. అనే పేర్లు అన్ని ఇళ్లలో అధికంగా ఉండడం విశేషం.

అందరికి ఆవే పేర్లు.. ఆ గ్రామంలో భక్తి శ్రద్ధలతో పూజించే హుచ్చు వీరప్ప తాత పేరు ఎక్కువగా ఉంటాయి. పెద్ద హుచ్చురప్ప.. చిన్న హుచ్చురప్ప.. పెద్ద హుచురమ్మ.. చిన్న హుచ్చురమ్మ.. అనే పేర్లు అన్ని ఇళ్లలో అధికంగా ఉండడం విశేషం.

4 / 6

ప్రతి ఏటా ఉత్సవాలు..  

హుచ్చు వీరప్ప తాత ఆరాధన ఉత్సవాలు ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో  వారం రోజులు పాటు జరుగుతాయి. ఈ ఉత్సవలకు కర్ణాటక, ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించడం జరుగుతుంది.

ప్రతి ఏటా ఉత్సవాలు.. హుచ్చు వీరప్ప తాత ఆరాధన ఉత్సవాలు ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో వారం రోజులు పాటు జరుగుతాయి. ఈ ఉత్సవలకు కర్ణాటక, ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించడం జరుగుతుంది.

5 / 6
పూల అలంకరణలో మొదటి ఆలయం.. 

ఆలూరు నియోజకవర్గం ఏ ఆలయంలో లేని విధంగా తాత వారి మూల విరాట్‌ను రక రకాల పూలతో అలంకరణ చేయడం ప్రత్యేకం. ఈ పూల అలంకరణ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో ఏడు రోజుల పాటు పంచాక్షరి జపంతో జరుగుతాయి. ఈ పూజలు గ్రామంలో అన్ని కులాల వారు ఏడు రోజులు ఎంతో భక్తితో జరుపుకోవడం ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం.

పూల అలంకరణలో మొదటి ఆలయం.. ఆలూరు నియోజకవర్గం ఏ ఆలయంలో లేని విధంగా తాత వారి మూల విరాట్‌ను రక రకాల పూలతో అలంకరణ చేయడం ప్రత్యేకం. ఈ పూల అలంకరణ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో ఏడు రోజుల పాటు పంచాక్షరి జపంతో జరుగుతాయి. ఈ పూజలు గ్రామంలో అన్ని కులాల వారు ఏడు రోజులు ఎంతో భక్తితో జరుపుకోవడం ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం.

6 / 6
Follow Us