సాలిడ్ సక్సెస్ కోసం సుందరాంగి ఎదురుచూపులు.. 

Rajeev 

25  February 2026

రెజీనా కాసాండ్రా.. సుధీర్ బాబు నటించిన శివ మనస్సులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది   రెజీనా కాసాండ్రా.

తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.

ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది రెజీనా అయినా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది

స్టార్ హీరోల సినిమాల్లో కనిపించినప్పటికీ లాభం లేకుండా పోయింది.  తెలుగుతో పటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ అందాల భామ.

తెలుగులో ఈ అమ్మడు 14 సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించి అదరగొట్టింది.

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో దుమ్మురేపింది రెజీనా కాసాండ్రా.

హిందీలోనూ ఈ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది, కేసరి చాప్టర్ 2, జాట్ సినిమాలో కనిపించింది ఈ వయ్యారి భామ.