Sai Pallavi: సందడంతా సాయి పల్లవిదే.. పూజాకన్నన్ ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ చూశారా?
సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. వినీత్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా పూజ, వినీత్‌ల నిశ్చితార్థం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Updated on: Jan 25, 2024 | 3:00 PM

సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. వినీత్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా పూజ, వినీత్‌ల నిశ్చితార్థం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

వినీత్, పూజ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు కూడా ఆశీర్వదించాయి . దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారు.

తాజాగా వినీత్, పూజల నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. సాయి పల్లవి దగ్గరుండి అన్నీ ఏర్పాట్లు చూసుకుంది. చెల్లి నిశ్చితార్థం వేడుకలో పాటలు పాడి, డ్యాన్సలు చేస్తూ ఆహూతులను అలరించిందీ అందాల తార.

తన సోదరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన మరిన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది సాయిపల్లవి. అందులో ఇరు కుటుంబ సభ్యులు రకరకాల గేమ్స్ ఆడుతూ కనిపించారు.

సాయి పల్లవి సోదరి పూజ కన్నన్ కూడా సినిమాల్లో నటించింది. అయితే పెద్దగా సక్సెస్ కాలేదు. తమిళంలో ‘చిత్తిరై సెవ్వనం’ అనే సినిమాలో నటించింది పూజ. ఆ సినిమాలో సముద్ర ఖణి కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేకపోయింది