- Telugu News Photo Gallery Cinema photos Actor come Hero Suhas New Movie ambajipeta marriage band Movie release date Telugu Entertainment Photos
Suhas – Ambajipeta Marriage Band: ఎమోషనల్ ఎంటర్టైనర్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.
కొందర్ని చూసినపుడు ఇతడేం హీరో.. ఈయన్ని చూడ్డానికి కూడా డబ్బులు పెట్టుకుని వస్తారా అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి ఎరుక అన్నట్లు.. ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు..? ఇండస్ట్రీలో ఓ నటుడిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కమెడియన్‌గా మొదలై.. హీరోగా మారిన ఆ నటుడెవరో తెలుసా..? యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే స్థాయి నుంచి ఇండస్ట్రీలో నిర్మాతలు నమ్మే మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు..
Updated on: Jan 25, 2024 | 2:26 PM

కొందర్ని చూసినపుడు ఇతడేం హీరో.. ఈయన్ని చూడ్డానికి కూడా డబ్బులు పెట్టుకుని వస్తారా అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి ఎరుక అన్నట్లు.. ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు..? ఇండస్ట్రీలో ఓ నటుడిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.

కమెడియన్‌గా మొదలై.. హీరోగా మారిన ఆ నటుడెవరో తెలుసా..? యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే స్థాయి నుంచి ఇండస్ట్రీలో నిర్మాతలు నమ్మే మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు.. దాన్ని చేసి చూపిస్తున్నారు సుహాస్.

కమెడియన్ నుంచి కారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి.. ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నారీయన. తాజాగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌తో వచ్చేస్తున్నారు సుహాస్.

మామూలుగా కమెడియన్ ఎవరైనా హీరోగా మారితే.. అతన్నుంచి కామెడీ సినిమానే ఊహిస్తాం. కానీ సుహాస్ అలా కాదు.. కలర్ ఫోటో నుంచే విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు.

కామెడీ ఉంటూనే.. కంటతడి పెట్టించే ఎమోషన్‌ను పట్టుకుంటున్నారు. అందుకే కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ అంత బాగా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యాయి.

హరీబరీగా వచ్చిన ప్రతీ సబ్జెక్ట్ సైన్ చేయకుండా ఏడాదికి ఒక్క సినిమా చేస్తున్నారు సుహాస్. అలా ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌తో వస్తున్నారు. దుష్యంత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కోసం గుండు కొట్టించుకున్నారు సుహాస్. ప్రస్తుతం ఈయన చేతిలో రెండు మూడు క్రేజీ సినిమాలున్నాయి. చూడాలిక ఏం జరగబోతుందో..?




