డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంతర్వేది సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు 25 కేజీల అరుదైన హనుమాన్ సొరచేప చిక్కింది. దీనిని అంతర్వేది పల్లెపాలెం హార్బర్లో రూ.9,000కు వేలం వేశారు. ఔషధ విలువలు ఉన్నాయని నమ్మే ఈ చేప మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.