AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hitech Highway: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త హైటెక్ హైవే ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. తగ్గనున్న దూరం

తెలుగు రాష్ట్రాలను కలుపుతూ మరో కొత్త జాతీయ రహదారి రానుంది. ఈ మేరకు ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. మరో రెండు నెలల్లో ఈ హైవేకు ప్రారంభోత్సవం చేసేందుకు రంగం సిద్దమైంది. అధ్యాధునిక టెక్నాలజీతో కూడిన వ్యవస్థతో ఈ హైవే నిర్మించారు.

Hitech Highway: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త హైటెక్ హైవే ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. తగ్గనున్న దూరం
National Highway
Venkatrao Lella
|

Updated on: Feb 26, 2026 | 2:38 PM

Share

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలో మరో కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది. యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మించారు. ఈ నాలుగు లైన్ల హైవే పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తి అవ్వగా.. మే నెలలో ప్రారంభించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఒక్కటి కూడా అందుబాటులో లేదు. దీంతో ఇదే తొలి రోడ్డుగా నిలవనుంది. ఈ రోడ్డు పొడవునా అత్యాధునిక టెక్నాలజీ కూడిన వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. అందుకే దీనిని హైటెక్ హైవేగా పిలుస్తున్నారు. దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రత్యేకతలు ఇవే..

-దారి పొడవునా ఎక్కడికక్కడ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు

-సమాచారాన్ని అందించేందుకు దారి పొడవునా పలు ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్‌లు అందుబాటులో ఉంటాయి

-ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్స్ ఏర్పాటు చేశారు

-ప్రమాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ వసూలు టెక్నాలజీ ఏర్పాటు

-పరిమిత సంఖ్యలో ఎంట్రీ, ఎగ్జిట్ ప్రదేశాలు ఉంటాయి

-అత్యాధునిక రవాణా నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేశారు

-సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు

-టెక్నాలజీతో కూడిన సేవలు అందుబాటులో ఉంటాయ

తగ్గనున్న 50 కిలోమీటర్ల దూరం

తెలంగాణలోని ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల మేర ఈ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మించారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లేవారికి ఈ రోడ్డు వల్ల ఏకంగా 56 కిలోమీటర్ల ప్రయాణ సమయం తగ్గనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే సూర్యాపేట, విజయవాడ మీదుగా 676 కిలోమీటర్ల మేర దూరం వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త నేషనల్ హైవే వల్ల 56 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఎన్‌హెచ్-365బీజీ నెంబర్‌ను ఈ కొత్త జాతీయ రహదారికి ఇప్పటికే కేటాయించారు. ఖమ్మం సమీపంలోని తల్లంపాడు నుంచి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వరకు ఈ హైవే ఉంటుంది. తెలుగు రాష్ట్రాలను కలిపే తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవేగా ఇది నిలవనుంది.  9 చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ ప్రదేశాలు అందుబాటులో ఉంటాయి.  దీంతో వేగంగా ప్రయాణం చేయవచ్చు. ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉండదు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విశాఖ వైపు తరచూ వేల మంది వెళ్తూ ఉంటారు. అలాంటివారికి దీని వల్ల ప్రయోజనం కలగనుంది.

Follow Us