AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEST 2026 Registration: ఇంటర్ విద్యార్ధులకు చివరి ఛాన్స్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న నెస్ట్‌ 2026 దరఖాస్తు గడువు!

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌-2026) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లోనే ఆన్‌లైన్ దరఖాస్తులు ముగియనున్నాయి. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 11.30 గంటల లోపు దరఖాస్తు..

NEST 2026 Registration: ఇంటర్ విద్యార్ధులకు చివరి ఛాన్స్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న నెస్ట్‌ 2026 దరఖాస్తు గడువు!
NEST Registration Deadline
Srilakshmi C
|

Updated on: Apr 06, 2026 | 2:23 PM

Share

ఇంటర్మీడియట్‌ పూర్తయిన విద్యార్థుల కోసం నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌-2026) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లోనే ఆన్‌లైన్ దరఖాస్తులు ముగియనున్నాయి. నెస్ట్‌లో ర్యాంకు కొట్టిన వారికి భువనేశ్వర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైసర్‌), యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ కోర్సులు చదివేందుకు అవకాశం కల్పిస్తారు. దీనితోపాటు వీరికి ఐదేళ్ల పాటు ప్రతి నెలా రూ.5000 స్టైపెండ్‌ కూడా అందుతుంది. వేసవిలో ప్రాజెక్ట్‌ కోసం ఏడాదికి రూ.20 వేల చొప్పున కాంటింజెన్సీ కూడా చెల్లిస్తారు. సైన్స్‌, మాథ్స్‌ కోర్సుల్లో ఆసక్తి ఉన్న విద్యార్ధులు ఇంటర్‌ తర్వాత ఉన్నత చదువులు కొనసాగించాలనే లక్ష్యంతో నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్టు (నెస్ట్‌) ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌ 2026) ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ సంస్థల్లో బయాలజీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కోర్సులు అందిస్తున్నారు. నైసర్‌లో 202, సీఈబీఎస్‌లో 59 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని సెమిస్టర్లలోనూ మేటి ప్రతిభ చూపిన విద్యార్థులకు భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ట్రైనింగ్‌ స్కూల్‌లో పరీక్ష రాయకుండానే ఇంటర్వ్యూకి అర్హత సాధిస్తారు. ఇందులో ఎంపికైనవారు శిక్షణ అనంతరం బార్క్‌లో ఉద్యోగావకాశం దక్కుతుంది.

ఇవి కూడా చదవండి

సైన్స్‌ గ్రూప్‌లతో 2024, 2025లో ఇంటర్‌ ఉత్తీర్ణత పొందినవారితోపాటు ప్రస్తుతం ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రాసిన విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 8, 2026వ తేదీ రాత్రి 11.30 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.1400, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.700 చొప్పున చెల్లించాలి. ఇక నెస్ట్‌ 2026 పరీక్ష జూన్‌ 6, 2026వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. అడ్మిట్ కార్డులు మే 15 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫలితాలు జూన్‌ 24, 2026వ తేదీన విడుదల చేస్తారు.

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌ 2026) ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రాత పరీక్ష విధానం..

నెస్ట్‌ 2026 పరీక్ష రెండు సెషన్‌లలో ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. మూడున్నర గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లీష్‌ మాధ్యమంలో ప్రశ్నలు అడుగుతారు. 4 సెక్షన్లలో బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ఒక్కో సెక్షన్‌కు 60 మార్కులు చొప్పున మొత్తం 240 మార్కులకు 80 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఒక్కో సెక్షన్‌లో 20 ప్రశ్నలు అడుగుతారు.

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌ 2026) ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us