మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా పితంపూర్లో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. పదో తరగతి విద్యార్థిని గణిత పరీక్ష రాస్తుండగా కడుపునొప్పి రావడంతో బాత్రూంకు వెళ్లింది. అక్కడే నవజాత శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సంఘటన పరీక్షా కేంద్రంలో గందరగోళానికి దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.