గుంటూరు బృందావన గార్డెన్స్‌లో ఆకతాయిలపై చర్యలకు ఎమ్మెల్యే గల్లా మాధవి అర్ధరాత్రి స్కూటీపై స్వయంగా వెళ్లారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఆమె ఘటనా స్థలానికి చేరుకోగానే ఆకతాయిలు పారిపోయారు. ఫిర్యాదు చేసిన మహిళకు ధైర్యం చెప్పి, గస్తీ పెంచాలని పోలీసులను ఆదేశించారు. ఆమె చొరవను సోషల్ మీడియాలో ప్రజలు అభినందిస్తున్నారు.