AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి తర్వాత కూడా హీట్ పెంచేస్తున్న హీరోయిన్లు

పెళ్లి తర్వాత కూడా హీట్ పెంచేస్తున్న హీరోయిన్లు

Phani CH
|

Updated on: Feb 25, 2026 | 7:22 PM

Share

పెళ్లి తర్వాత హీరోయిన్లు గ్లామర్‌కు దూరమవుతారనే మాట టాలీవుడ్‌లో పాతబడిపోయింది. తమ కెరీర్ కోసం, అవకాశాల కోసం కాజల్, సమంత, కీర్తి వంటి స్టార్ హీరోయిన్లు మరింత బోల్డ్‌గా కనిపిస్తున్నారు. పెళ్లి, విడాకులు తమ కెరీర్‌కు అడ్డుకాదని, గ్లామర్ షోతోనే అవకాశాలు అందిపుచ్చుకుంటున్నామని వీరు నిరూపిస్తున్నారు.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. ఈ సామెత మన హీరోయిన్లకు ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు.. అస్సలు ఓల్డ్ అవ్వదు తెలుసా..? ఇప్పుడూ ఇదే జరుగుతుంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు గ్లామర్ షోకు దూరంగా ఉంటారంటారు కానీ వీళ్లేమో ఇంకా రెచ్చిపోతున్నారు. ఏంటి నమ్మరా.. ఒక్కసారి ఈ ముద్దుగుమ్మలను చూసేయండి.. ఎందుకు నమ్మరో మేం కూడా చూస్తాం..! గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అవ్వడం అనేది అరుదైన విషయం. అందుకే అనుపమ, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్ సైతం హాట్ షో వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లైన హీరోయిన్లకు కూడా ఛాన్సుల కోసం రెచ్చిపోక తప్పట్లేదు. కీర్తి అయితే ఆఫ్టర్ మ్యారేజే అందాల ఆరబోతలో డోస్ పెంచేసారు. కాజల్ అగర్వాల్ కూడా గ్లామర్ దారిలో వెళ్తున్నారు. సినిమాల్లో పద్దతిగానే కనిపిస్తున్న కాజల్.. ప్రమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం రెచ్చిపోతున్నారు. మొన్న ఓ సినిమా ప్రమోషన్స్‌లో చాలా వరకు గ్లామర్‌గానే కనిపించారు చందమామ. తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో చందమామ గ్లామర్ షో మేజర్ హైలైట్‌గా నిలిచింది. రకుల్ పెళ్లి తర్వాత డోస్ ఇంకా పెంచేసారు. ఆ మధ్య బికినీ షో కూడా చేసారు. ఇక విడాకుల తర్వాత సమంతను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఈ బ్యూటీ షోకు థర్మామీటర్లు పేలిపోతున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన తర్వాత కూడా కియారా అద్వానీ గ్లామర్ షో వైపు అడుగులేస్తున్నారు. నయనతార సైతం టాక్సిక్ సినిమా కోసం గ్లామర్ డోస్ పెంచేసారు. మొత్తానికి హీరోయిన్లందరూ పెళ్లితో కెరీర్‌ను ముడిపెట్టట్లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సమంత ధీటైన జవాబు: సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !

Follow Us