- Telugu News Photo Gallery Cinema photos Nara Lokesh Wife Brahmani And Many Others Attend To Namrata Shirodkar Birthday Party, Photos
Namrata Shirodkar: నమ్రత బర్త్ డే పార్టీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా నారా బ్రాహ్మణి, అల్లు స్నేహా.. ఫొటోస్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ సందర్భంగా జర్మనీలో ఉన్న మహేశ్ తన సతీమణికి సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపాడు. అయితే నమ్రత బర్త్‌డే పార్టీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
Updated on: Jan 24, 2024 | 8:17 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ సందర్భంగా జర్మనీలో ఉన్న మహేశ్ తన సతీమణికి సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపాడు. అయితే నమ్రత బర్త్‌డే పార్టీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

ఇక బంధు మిత్రులు, స్నేహితులు, సన్నిహితుల కోసం గ్రాండ్‌గా బర్త్ డే పార్టీ ఏర్పాటుచేసింది నమ్రత. సితార, గౌతమ్‌లతో సహా పలువురు సెలబ్రిటీలు ఈ పార్టీలో పాల్గొన్నారు.

అతిథులందరి సమక్షంలో నమ్రత కేక్ కట్ చేసింది. అనంతరం అందరితో సరదాగా ఫొటోలు దిగింది. ప్రస్తుతం నమ్రత బర్త్ డే పార్టీ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

నమ్రత బర్త్ డే పార్టీకి హాజరైన వారిలో టీడీపీ నాయకులు నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

అలాగే అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి, డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత కూడా ఈ బర్త్ డే పార్టీలో సందడి చేశారు. నమ్రత ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయగా.. ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.