సాయి పల్లవి.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఈ ముద్దుగుమ్మ. చేసింది కొన్ని సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది.
ఆతర్వాత వరుసగా సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న సాయి పల్లవి ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తోంది.
తమిళ్ లో అమరన్, తెలుగులో తండేల్ సినిమాలతో హిట్స్ అందుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది.
రామాయణం సినిమాలో సీతగా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి లగ్జరీ ఫెసిలిటీలను సాయి పల్లవి కోరుకోదు.
ఇప్పటికే హిందీలో రామాయణం సినిమాలో సీతగా నటిస్తుంది సాయి పల్లవి. అలాగే ఇటీవలే మరో బాలీవుడ్ మూవీ ఏక్ ధిన్ అనే సినిమాను అనౌన్స్ చేసింది
దాంతో సాయి పల్లవి ఫ్యాన్స్ లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఈ అమ్మడు తెలుగులో సినిమాలు తగ్గిస్తుందా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.