AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA : అహ్మదాబాద్‌లో మిల్లర్ విధ్వంసం.. రికార్డులతో రెచ్చిపోయిన బుమ్రా..టీమిండియా టార్గెట్ 188

IND vs SA : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

IND vs SA  : అహ్మదాబాద్‌లో మిల్లర్ విధ్వంసం.. రికార్డులతో రెచ్చిపోయిన బుమ్రా..టీమిండియా టార్గెట్ 188
Ind Vs Sa (1)
Rakesh
|

Updated on: Feb 22, 2026 | 8:57 PM

Share

IND vs SA : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఒక దశలో భారత బౌలర్ల ధాటికి 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సౌతాఫ్రికాను డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ జోడీ అద్భుతంగా ఆదుకుంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా కీలక రికార్డును సమం చేయగా, అర్ష్‌దీప్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టాడు.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. జస్ప్రీత్ బుమ్రా తన మొదటి ఓవర్లోనే క్వింటన్ డికాక్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. ఆ వెంటనే అర్ష్‌దీప్ సింగ్ సఫారీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రామ్ (4)ను అవుట్ చేయగా, బుమ్రా మరో వికెట్ తీసి సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బ తీశాడు. అయితే, క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (63) తన అనుభవాన్నంతా ఉపయోగించి భారత స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (45) తో కలిసి కేవలం 50 బంతుల్లోనే 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరు బోర్డును పరిగెత్తించాడు.

ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా జస్ప్రీత్ బుమ్రా ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ (32 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును బుమ్రా సమం చేశాడు. ఆఖరి ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన బుమ్రా, తన వైవిధ్యమైన బంతులతో సఫారీ బ్యాటర్లను కట్టడి చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ కూడా 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని 200 పరుగుల లోపే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

పేస్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ సౌతాఫ్రికా బ్యాటర్లు, భారత స్పిన్నర్లను మాత్రం టార్గెట్ చేశారు. వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ ఓవర్లలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా మిల్లర్ కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని భారత్‌కు సవాలు విసిరాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ తెలివిగా శివం దూబేను బౌలింగ్‌కు దించి బ్రెవిస్ వికెట్‌ను తీయడంతో భారత్ మళ్లీ రేసులోకి వచ్చింది. చివరికి నిర్ణీత ఓవర్లలో సౌతాఫ్రికా 187 పరుగులు చేయడంతో, భారత్ గెలవాలంటే 188 పరుగులు చేయాల్సి ఉంది. అహ్మదాబాద్ పిచ్‌పై ఈ టార్గెట్ ఛేదించడం భారత బ్యాటర్లకు ఒక సవాలే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us