AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA : సూపర్-8 లో అసలైన కిక్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే

IND vs SA : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలైన రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. సూపర్-8 దశలో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ - సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి.

IND vs SA : సూపర్-8 లో అసలైన కిక్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే
Ind Vs Sa
Rakesh
|

Updated on: Feb 22, 2026 | 6:42 PM

Share

IND vs SA : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలైన రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. సూపర్-8 దశలో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ – సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు స్టేడియానికి చేరుకున్నాయి. గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచిన ఈ రెండు జట్లలో, ఈరోజు ఓటమిని రుచి చూసే మొదటి జట్టు ఏదో తేలిపోనుంది. ప్రస్తుతం టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడటం ఇది 8వ సారి. గత 7 మ్యాచ్‌లలో భారత్ 5 సార్లు గెలవగా, సౌతాఫ్రికా కేవలం 2 సార్లు మాత్రమే విజయం సాధించింది. మొత్తం టీ20 రికార్డులను పరిశీలిస్తే 35 సార్లు తలపడగా.. 21 సార్లు భారత్, 13 సార్లు సౌతాఫ్రికా గెలిచాయి. ఇరు జట్లు ప్రస్తుతం బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాయి. భారత్ తన గత 12 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఓటమి అన్నదే చూడలేదు. అటు దక్షిణాఫ్రికాకు కూడా ఇది ప్రతీకార మ్యాచ్ లాంటిదే. గతేడాది జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని సఫారీలు కసితో ఉన్నారు.

టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతను సున్నాకే వెనుదిరిగాడు. అయినప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతనికి పూర్తి మద్దతు ప్రకటించారు. అభిషేక్ గురించి తాను ఆందోళన చెందడం లేదని, అతను ఫామ్‌లోకి వస్తే ప్రత్యర్థి బౌలర్లే భయపడతారని సూర్య నమ్మకంగా ఉన్నాడు. ఇక లోకల్ బాయ్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌తో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి మరోసారి మ్యాజిక్ చేయాలని జట్టు ఆశిస్తోంది.

నరేంద్ర మోదీ స్టేడియంలోని నల్లమట్టి పిచ్‌పై లైట్ల వెలుగులో పేస్ బౌలర్లకు ఆరంభంలో మంచి స్వింగ్ లభించే అవకాశం ఉంది. ఇది బ్యాటర్లకు సవాలుగా మారనుంది. అయితే, సౌతాఫ్రికా పై వరుణ్ చక్రవర్తికి అద్భుతమైన రికార్డు ఉంది. గత 8 మ్యాచ్‌లలో అతను ప్రతిసారీ కనీసం రెండు వికెట్లు తీయడం విశేషం. మరోవైపు సఫారీ జట్టు పవర్‌ప్లేలో అత్యంత విధ్వంసకర బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తోంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రామ్, క్వింటన్ డికాక్ జోడీని అడ్డుకోవడం భారత బౌలర్లకు పెద్ద టాస్క్ కానుంది. సెమీఫైనల్ దిశగా అడుగులు వేయాలంటే ఈ మ్యాచ్ గెలవడం భారత్‌కు ఎంతో కీలకం.

భారత్ ప్లేయింగ్ XI:

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

సౌతాఫ్రికా ప్లేయింగ్ XI:

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఎయిడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సన్, కేశవ్ మహారాజ్, కాగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, క్వేనా మఫాకా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us