విమానం ల్యాండ్ అవ్వగానే..ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకేసి..
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో షార్జా నుంచి వచ్చిన ఎయిర్ అరేబియా విమానం ల్యాండ్ కాగానే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకాడు. పుదుక్కోట ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతతో ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించింది. విమానం నెమ్మదిగా కదులుతుండటంతో అతడికి, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన తోటి ప్రయాణికులలో ఆందోళన కలిగించింది.
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. షార్జా నుంచి వచ్చిన ఎయిర్ అరేబియా విమానం ల్యాండ్ కాగానే, ట్యాక్సీవేపై కదులుతుండగా ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచి బయటకు దూకాడు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.పుదుక్కోటకు చెందిన సదరు ప్రయాణికుడిని వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ప్రయాణికుడు తీవ్రమైన వాంతులతో అస్వస్థతకు గురయ్యాడని, ఆ కంగారులోనే ఇలా చేశాడని విమానాశ్రయ అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని పోలీసులకు అప్పగించారు. విమానం నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, విమానానికి కూడా నష్టం కలగలేదని విమానాశ్రయ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఘటన కారణంగా ప్రధాన రన్‌వేను గంటపాటు మూసివేసి విమానాలను దారి మళ్లించారు.
మరిన్ని వీడియోల కోసం :
పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్‌ను నిలబెట్టేదెవరు..?
ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారుగా.. ఈసారి బాక్సులు బద్ధలే..!
టికెట్లు, థియేటర్లు.. టాలీవుడ్‌లో కొత్త గొడవలు..!
సెంచరీకి చేరువలో సంచలన ప్రయోగం
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

