AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరసాపురం వీధుల్లో వింటేజ్ వైభవం.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న 1947 నాటి రోల్స్‌ రాయిస్‌!

ఆధునిక కార్ల యుగంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును చాటుకుంటూవస్తున్న కారు రోల్స్ రాయిస్. తాజాగా ఆరు దశాబ్దాల క్రితం నాటి ఈ రాజసం నరసాపురం వీధుల్లో ఇప్పుడు సందడి చేసింది. స్వాతంత్ర్య కాలం నాటి జ్ఞాపకాలను నెమరువేస్తూ, 1947 మోడల్ రోల్స్ రాయిస్ కారు పట్టణ వాసులను మంత్రముగ్ధులను చేసింది. ఈ స్టైలిష్ వింటేజ్ కార్‌ను చేసేందుకు జనాలు క్యూ కడుతున్నారు.

B Ravi Kumar
| Edited By: |

Updated on: May 04, 2026 | 8:51 PM

Share
నరసాపురం వీధుల్లో 1947 నాటి వింటేజ్ కారు చక్కర్లు కొడుతోంది. స్థానికంగా జరిగిన ఒక వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో ఈ వింటేజ్ కారు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన  వివాహ వేడుకను మరింత ఘనంగా, రాయల్‌గా మార్చేందుకు ఈ అరుదైన వాహనాన్ని ప్రత్యేకంగా రాజమహేంద్రవరం నుంచి అద్దెకు తీసుకువచ్చారు.

1 / 5
చరిత్రను కళ్ళకు కట్టే ఈ 1947 రోల్స్ రాయిస్ కారు, నేటి తరం అధునాతన మోడళ్లను సైతం తలదన్నేలా ఉండటం గమనార్హం. ఎర్రటి రంగుతో తళతళలాడుతూ, ఆధునిక హంగులను అద్దుకున్న ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే చూపరులు కళ్ళు తిప్పుకోలేకపోయారు.

2 / 5
సాధారణంగా సినిమాల్లోనో లేక మ్యూజియాల్లోనో కనిపించే ఇలాంటి వింటేజ్ వాహనం నేరుగా తమ కళ్ళ ముందు ప్రత్యక్షమవడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ కారు వద్ద నిలబడి సెల్ఫీలు తీసుకునేందుకు జనం పోటీ పడ్డారు. ముఖ్యంగా యువత, చిన్నారులు ఈ పాత కాలపు కారు విశేషాలను అడిగి తెలుసుకుంటూ, దాని అందాన్ని తమ కెమెరాల్లో బంధించారు.

3 / 5
వివాహ ఊరేగింపుకు ఒక ప్రత్యేక ఆకర్షణగా మారిన ఈ రోల్స్ రాయిస్ నరసాపురంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. మారుతున్న కాలంతో పాటు శుభకార్యాల్లో కూడా వైవిధ్యం కోరుకుంటున్న నేటి తరం, ఇలాంటి పాత కాలపు వింటేజ్ వాహనాలపై ఆసక్తి చూపుతోంది. గుర్రం రధాలు , ఎడ్ల బండ్లు ఇలా చాలారకాల వాహనాలు పెళ్లి ఊరేగింపులో ఇటివల కాలంలో చోటు దక్కిన్చుకుంటున్నాయి .

4 / 5
అదేసమయంలో వధూవరులను తమ తమ సతికి తగినట్టు కార్లపైనా ప్రదర్సంగా పెండ్లి మండపాలకు తీసుకొనివేలుతున్నారు. తణుకు , రాజమహేంద్రవరం వంటి నగరాల నుండి ఇలాంటి అరుదైన వాహనాలను అద్దెకు తెప్పించుకుని తమ వేడుకలను చిరస్మరణీయంగా మార్చుకుంటున్నారు.

5 / 5
Follow Us
వయసైపోయిన పెద్దవాళ్ళు తప్పక తినాల్సిన పల్లెటూరి పొలం గారెలు..

సూర్య కెప్టెన్సీ పోస్ట్ పీకేసిన గంభీర్.. కొత్తగా సారథి ఎవరంటే?

బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్నిపెంచిన కేంద్ర ప్రభుత్వం

ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న తల్లి..

ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పప్పులు తప్పక తినండి!

32 ఏళ్ల తర్వాత ఆ ఊరుకు బస్సొచ్చింది.. ఫలించిన గ్రామస్తుల కల

ఆ సినిమా తర్వాత ఇల్లు , ఆస్తులు అమ్మేశా.. నిర్మాత ఎంఎస్ రాజు..

రూల్‌ ఆఫ్‌ 72.. రూ.5 లక్షల పెట్టుబడి, రూ.10 లక్షల లాభం!

శతమానం భవతి,వందేళ్ల వయసులోనూ నిండు నూరేళ్ల వేడుక జరుపుకున్న బామ్మ

శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు..