AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamata Banerjee: దీదీకి దిమ్మతిరిగే షాక్.. భవానీపూర్‌లో మమతా ఓటమి!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత గడ్డ అయిన భవానీపూర్ నియోజకవర్గంలో అనూహ్య ఓటమిని చవిచూశారు. దశాబ్దాలుగా ఆమెకు అండగా ఉన్న ఈ నియోజకవర్గ ఓటర్లు ఈసారి మార్పు వైపు మొగ్గు చూపడం రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Mamata Banerjee: దీదీకి దిమ్మతిరిగే షాక్.. భవానీపూర్‌లో మమతా ఓటమి!
Mamata Banerjee Suffers Shocking Defeat
Anand T
|

Updated on: May 04, 2026 | 10:22 PM

Share

గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రాజకీయాల్లో చక్రం తిప్పిన దీదీకి 2026 ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. ఊహించని విధంగా తృణముల్ కాంగ్రెస్ కేవతం 60 సీట్లకే పరిమితమైంది. అంతేకాదు.. పార్టీ అధినేత మమతా బెనర్జీ సైతం తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఘోర ఓటమి చవిచూసింది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ భవానీపూర్ నుండి కాకుండా నందిగ్రామ్ నుండి పోటీ చేసి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. కానీ ఆ తర్వాత జరిగిన భవానీపూర్ ఉప ఎన్నికల్లో ఆమె రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు.

కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె మరోసారి సువేందు అధికారి చేతిలోనే ఘోర ఓటమి చవిచూసింది. సీఎం అభ్యర్థి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేందు దాదాపు 15వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఇక బెంగాల్‌లో మొత్తం 293 స్థానాల్లో ఇప్పటి వరకు 192 బీజేపీ కైవసం చేసుకోగా.. 68 స్థానాల్లో టీఎంపీ విజయం సాధించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us