హైదరాబాద్లోని క్రియాన్స్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న ఆరు నెలల పసికందును చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా, కాలం చెల్లిన మందులు, ఇంజెక్షన్ల కారణంగా మృతి చెందింది. పోలీసులు విచారణ చేపట్టగా, ఆసుపత్రిలో పలు కాలం చెల్లిన మందులు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.