Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో రెండు కొత్త పథకాలు.. ప్రతీఒక్కరికి రూ.2 లక్షలు.. అందరికీ ఛాన్స్
ఏపీలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు శుభవార్త. వీరి కోసం ఏపీ ప్రభుత్వం రెండు పథకాలను తీసుకొచ్చింది. ఇవి వీరికి ఆర్ధిక భరోసా ఇవ్వనున్నాయి. వీరికి బీమా సౌకర్యం కల్పించనున్నాయి. జస్ట్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ మొత్తంలో బీమా పొందవచ్చు. వీటి గురించి తెలుసుకుందాం.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమం కోసం ముందడుగు వేసింది. వారికి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన పథకాలను రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తల కోసం అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి ఆ రెండు పథకాలు అంగన్‌వాడ్వీలలో పనిచేసేవారికి వర్తించనున్నాయి. ఈ నిర్ణయం వల్ల అంగన్వాడీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు ఈ పథకాలేంటి..? వీటీ వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది?అనే విషయాలు చూద్దాం.
పీఎం జీవనజ్యోతి యోజన
అంగన్‌వాడీ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఏదైనా అనుకొని ప్రమాదం జరిగినప్పుడు ఇది వారి కుటుంబానికి భరోసా ఇస్తుంది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు దీనికి అర్హులు. డాదికి రూ.436 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఏదైనా ప్రమాదం లేదా మరణం జరిగితే కుటుంబానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందిస్తారు. 50 ఏళ్లు దాటిన వారికి ఈ పథకం వర్తించదు.
పీఎం సురక్ష బీమా యోజన
ఈ పథకం కింద లబ్ది పొందేందుకు కేవలం రూ.20 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఏదైనా ప్రమాదం జరిగినా లేదా సహజ మరణం పొందినా కుటుంబానికి రూ.2 లక్షలు అందిస్తారు. శాశ్వత అంగ వైకల్యం పొందితే రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యం పొందితే రూ.లక్ష అందిస్తారు. ఈ రెండు పథకాల వల్ల అంగన్వాడీలకు, వారి కుటుంబాలకు భద్రతగా నిలుస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆసక్తిగల అంగన్ వాడీ కార్యకర్తలు ఈ సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించింది. అటు రాష్ట్రంలో వేలాదిమంది అంగన్ వాడీ కార్యకర్తలు ఉన్నారు. వీరి అంగన్ వాడీ కేంద్రాల్లో తమ సేవలను అందిస్తున్నారు.
