AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth : జబర్దస్త్ మానేశాక సినిమా ఆఫర్స్ రావట్లేదు.. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు.. కమెడియన్ ఎమోషనల్..

ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. ఆ షో ద్వారా పాపులర్ అయిన కొందరు సినిమాల్లో సహాయ నటులుగా సెటిల్ కాగా.. మరికొందరు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ తన లైఫ్, కెరీర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. జబర్దస్త్ మానేశాక సినిమా ఆఫర్స్ రావట్లేదని.. తనను ఎవరూ పట్టించుకోవట్లేదని అన్నారు.

Jabardasth : జబర్దస్త్ మానేశాక సినిమా ఆఫర్స్ రావట్లేదు.. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు.. కమెడియన్ ఎమోషనల్..
Untitled 3
Rajitha Chanti
|

Updated on: Feb 22, 2026 | 9:38 PM

Share

జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన హాస్యనటులలో ఫణి ఒకరు. బుల్లితెరపై తన కామెడీ టైమింగ్ ఎంతో అలరించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అవకాశాలు రావడం లేదు. అలాగే అటు జబర్దస్త్ కామెడీ షోకు సైతం దూరమయ్యాడు. గతంలో అనేక చిత్రాలతో బిజీగా గడిపిన ఫణి, తన కెరీర్‌లోని ప్రస్తుత సవాళ్లు, పరిశ్రమలో చోటుచేసుకుంటున్న మార్పులపై ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఫణి మాట్లాడుతూ.. ఒకప్పుడు వరుస సినిమా అవకాశాలతో ఎంత బిజీగా ఉండేవారో వివరించారు. జబర్దస్త్‌లో ఆయన కామెడీకి ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అయితే, ఇప్పుడు ఆఫర్లు ఎందుకు రావడం లేదనే విషయంపై మాట్లాడుతూ.. పరిశ్రమలో వస్తున్న కొత్త ధోరణులను ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుండి వస్తున్న కొత్త తరం టాలెంట్, వారు స్వయంగా షూటింగ్, ఎడిటింగ్ చేసుకోవడమే కాకుండా, తక్కువ ఖర్చుతో పని చేయడానికి సిద్ధంగా ఉండటం సీనియర్ నటులకు అవకాశాలు దూరం చేస్తున్నాయని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

తాను సినిమా అవకాశాల కోసం ఎన్నడూ రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదని, తనకు నచ్చిన మొత్తానికి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఫణి స్పష్టం చేశారు. “లక్షల్లో కాకపోయినా, నాకు నచ్చింది ఇప్పించినా కూడా ఇప్పటికీ ఏదైనా చేస్తా” అని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఫోన్ కాల్స్‌తో బిజీగా ఉన్న తాను, ఇప్పుడు ఫోన్ కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. పరిశ్రమలో “అదృష్టం” ఉన్నప్పుడే అవకాశాలు వస్తాయని, అది లేనప్పుడు ఆగిపోతాయని, ఇది తనకే కాదు, పలువురు పెద్ద నటులకు కూడా అనుభవమేనని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

సినిమా పరిశ్రమలో ఉన్న ఆర్థిక సవాళ్ళను గురించి మాట్లాడుతూ, కేవలం సినిమాపై ఆధారపడి బతకడం చాలా కష్టమని అన్నారు. పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులు భరించడానికి, పక్కన ఏదైనా వృత్తి లేదా ఆదాయ మార్గం ఉండటం తప్పనిసరి అని అన్నారు. తనను బయట చూసినప్పుడు ప్రేక్షకులు “అన్నా, ఫణి అన్నా, ఏమైంది? నువ్వు కనపడట్లేదు” అని అడుగుతుంటే ఎంతో ఎనర్జీ వస్తుందని ఆయన తెలిపారు.

Phani New

Phani New

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us