AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter Supplementary Results 2026: మరికాసేపట్లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. మార్కుల లిస్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

AP Inter Supplementary Results 2026 Date and Time: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల ఫలితాలు ఈ రోజు (జూన్‌ 18) విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోండి..

AP Inter Supplementary Results 2026: మరికాసేపట్లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. మార్కుల లిస్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
AP Inter Supplementary Results
Srilakshmi C
|

Updated on: Jun 18, 2026 | 6:22 AM

Share

అమరావతి, జూన్‌ 18: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల ఫలితాలు ఈ రోజు (జూన్‌ 18) విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి రంజిత్‌ బాషా తెలిపారు. అభ్యర్ధులు తమ ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌ ద్వారాహాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అలాగే మనమిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా కూడా ఫలితాలను పొందొచ్చు. కాగా ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్‌ రాసే సదుపాయం కల్పించారు. దీంతో విద్యార్ధులు తమ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సెకండ్‌ ఇయర్‌ విద్యార్థుల బెటర్‌మెంట్‌ ఫలితాలు వచ్చాక మూడు రోజుల్లో ఈఏపీసెట్‌ ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా ఈ ఏడాది ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 5 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రెండేళ్లకు సంబంధించిన 12.50 లక్షల జవాబుపత్రాల మూల్యాంకనం జూన్‌ 15తో ముగిసింది. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఈ రోజు ఫలితాల విడుదలకు సన్నాహాలు పూర్తి కావడంతో విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Follow Us