AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అమ్మాయిలకు మంకీ మాస్క్ తగిలిచ్చి సైకో అరాచకాలు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్

కొన్ని నెలల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. కంటెంట్ పరంగానూ ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. బుధవారం (జూన్ 17) అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.

OTT Movie: అమ్మాయిలకు మంకీ మాస్క్ తగిలిచ్చి సైకో అరాచకాలు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్
OTT Movie (
Basha Shek
|

Updated on: Jun 17, 2026 | 9:55 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. దృశ్యం 3, అతిరథి, రేజర్, కేనతా కానం, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3 తదితర ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేయనున్నాయి. అయితే వీటి కన్నా ముందే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. కంటెంట్ పరంగా ప్రశంసలు కూడా అందుకుంది. అయితే పేరున్న నటీ నటులు లేకపోవడం, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం, ఇతర కారణాలతో ఈ మూవీ ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోయింది. ఇప్పుడీ మూవీ సడెన్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక పల్లెటూరిలో వరుసగా జరిగే హత్యలు కలకలం రేపుతాయి . అమ్మాయిలను టార్గెట్ గా చేసుకున్న ఒక సైకో కిల్లర్ వారిని అతి దారుణంగా హతమారుస్తుంటాడు. అంతేకాదు హత్య తర్వాత వారి తలలకు మంకీ మాస్క్ పెడుతుంటాడు. అలా ఒక రోజు హీరో మేనకోడలు కీర్తి కూడా శవంగా కనిపిస్తుంది. దీంతో స్వయంగా అతనే ఇన్వస్టిగేషన్ మొదలు పెడతాడు. ఈ క్రమంలో అతనికి సంచలన విషయాలు తెలుస్తాయి. మరి అమ్మాయిలను చంపుతున్నదెవరు? హత్య చేసి తలలకు మంకీ మాస్క్ పెట్టడానికి గల కారణాలు ఏంటీ? ఒక సాధారణ కానిస్టేబుల్ అయిన హీరో ఈ హత్యలను ఆపగలిగాడా? క్రిమినల్ ను పట్టుకున్నాడా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ ఈ సినిమా పేరు కానిస్టేబుల్. మధులిక వారణాసి హీరోయిన్‌గా చేసింది. మురళిధర్ గౌడ్, పుష్ప ఫేమ్ కల్ప లత, రవి వర్మ, సూర్య, నిత్య శ్రీ, కశిష్ రాజ్‌పుత్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఇప్పటికే ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, బుధవారం నుంచి ఆహా ఓటీటీలోకి కూడా అందుబాటులోకి వచ్చేసింది.

ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ కానిస్టేబుల్ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం