AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్ మూవీ

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు నార్మల్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. అయితే ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడీ సినిమా ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

OTT Movie: మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్ మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 17, 2026 | 7:00 AM

Share

ఒక్కోసారి థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో అదరగొడుతుంటాయి. రికార్డు వ్యూస్ తో ఓటీటీలను షేక్ చేస్తుంటాయి. అలా థియేటర్లలో పెద్దగా ఆడని ఒక సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ లో సూపర్ ట్రెండింగ్ అవుతుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ఓటీటీల్లో ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మే 22నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. దీంతో కేవలం రెండు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేసిందీ సినిమా. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. చిన్న వయసులోనే పేరెంట్స్‌‌ను కోల్పోయిన హీరోయిన్ నేహను తమ ఇంటికి తీసుకొచ్చి పెంచుతాడు ఆమె మామయ్య. అయితే వరుసకు మరదలైన నేహాపై టీనేజ్ నుంచే పిచ్చి ప్రేమ పెంచుకుంటాడు హీరో కార్తీక్. కానీ నేహా మాత్రం మరొకరిని ఇష్టపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్ ఓ సైకోలా మారిపోతాడు. మరి బావ అంటే ఇష్టం లేని నేహా అతన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? నేహాను లవ్ చేసిన గౌతమ్ ఏమయ్యాడు? చివరకు ఈ స్టోరీ ఎక్కడకు దారి తీసింది? అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నందు, అవికా గౌర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పేరు అగ్లీ స్టోరీ. పేరుకు తగ్గట్టుగానే ఇదొక బోల్డ్ రొమాంటిక్ లవ్ స్టోరీ. అయితే ఈ కథకు కాస్త సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఆసక్తికరంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రణవ్ స్వరూప్. ఈ సినిమాలో రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.  రియో జియో ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించారు. అమాయక భార్య పాత్రలో అవికా గౌర్ నటించగా… సైకో మొగుడిగా నందు కనిపించారు. ప్రస్తుతం అగ్లీ స్టోరీ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ ఓటీటీల్లో టాప్ ట్రెండింగ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ దక్కడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఆహా ఓటీటీలో అగ్లీ స్టోరీ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us