AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఢిల్లీలో జరిగిన వరుస హత్యలు.. ఓటీటీ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

కొన్నేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు హిందీ, తెలుగుతో పాటు తర భాషల్లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

OTT Movie: ఢిల్లీలో జరిగిన వరుస హత్యలు.. ఓటీటీ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 15, 2026 | 10:24 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, మలయాలం, తమిళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3, కెనాతా కానమ్ లాంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ మూవీస్ వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి రానున్నాయి. అయితే గత వారం ఓటీటీలోకి వచ్చిన కొన్ని సినిమాలు ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. అందులో ప్రధానంగా ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహకు అందని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ లో థ్రిల్లింగ్ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ సిరీస్ కు టాప్ రేటింగ్ దక్కడం విశేషం.  ఈ సిరీస్ కథ విషయానికి వస్తే..  1978లో ఢిల్లీ నగరంలో జరిగిన జంట హత్యల కేసు ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఓ అధికారి పిల్లలు ఇద్దరు ఒకే రోజు అదృశ్యం అవుతారు. కట్ చేస్తే.. ఆ మరుసటి రోజు పిల్లలిద్దరూ అడవిలో దారుణ హత్యకు గురవుతారు. ఈ మర్డర్ కేసును ఛేదించేందుకు  జయప్రకాష్ జాతవ్ అనే ఓ స్పెషల్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అసలు ఆ ఇద్దరు పిల్లలను అంత కిరాతకంగా చంపిందెవరు? ఎందుకు ఈ హత్యలు చేశారు? సదరు పోలీస్ అధికారి ఆ క్రిమినల్స్ ను ఎలా పట్టుకున్నాడు? అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ సిరీస్ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ పేరు రాఖ్. ఒకప్పటి అందాల హీరోయిన్ సోనాలి బింద్రే ఇందులో మరో కీలక పాత్ర పోషించింది. ఆమిర్ బషీర్, దివ్యా శర్మ తదితరులు  కీలక పాత్రలు పోషించారు.  పాతాళ్ లోక్ సిరీస్ ఫేం ప్రొసిత్ రాయ్ ఈ సిరీస్ ను తెరకెక్కించడం విశేషం. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాఖ్ వెబ్ సిరీస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us