AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాయింట్ కలెక్టర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. అనిల్ రావిపూడి చిత్రాల్లో మస్ట్

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటివరకు 9 సినిమాలు చేశారు. అందులో ఆరు సినిమాల్లో ఈ నటుడు వివిధ పాత్రలు పోషించారు. అయితే ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్లలో ఒకరైన ఈయన ఒకప్పుడు జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు.

జాయింట్ కలెక్టర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. అనిల్ రావిపూడి చిత్రాల్లో మస్ట్
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jun 14, 2026 | 12:12 PM

Share

మన తెలుగు సినిమా నటుల్లో చాలా మంది డిగ్రీలు, ఎంబీబీఎస్ లు, ఇంజినీరింగ్ లు, మాస్టర్స్, పీహెచ్ డీలు చేశారు. ఇంకొంత మంది విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించారు. మల్లీ నేషనల్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు కూడా చేశారు. అయితే నటనపై ఆసక్తితో చాలా మంది లక్షల జీతాలు, లగ్జరీ లైఫ్ ను వదిలి పెట్టి ఇండస్ట్రీలోకి వచ్చారు. కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నటనలోనే తమ కొత్త జీవితాన్ని వెతుక్కున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో సహాయక నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఒకప్పుడు జాయింట్ కలెక్టర్ గా సేవలు అందించారు. అది కూడా మన రాష్ట్రంలోనే. చాలా ఏళ్ల పాటు విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గా పని చేశారు. అయితే నటనపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేశారు.

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటివరకు 9 సినిమాలు చేశారు. దాదాపు అన్ని సూపర్ హిట్ సినిమాలే. అయితే రావిపూడి తెరకెక్కించిన ఆరు సినిమాల్లోనూ ఈ యాక్టర్ నటించడం విశేషం. వీటితో పాటు ఇప్పటివరకు సుమారు 70కు పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారీ నటుడు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా? వడ్లమాని శ్రీనివాస్. పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ.. కింది ఫొటోలు చూస్తే ఇట్టే కళ్ల ముందు మెదులుతారు.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో వడ్లమాని శ్రీనివాస్..

View this post on Instagram

A post shared by Vani (@bhavanisan_akula)

కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు శ్రీనివాస్. ఆ తర్వాత ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే, శైలజా రెడ్డి అల్లుడు, ‘నా సామి రంగా, వకీల్ సాబ్, భగవంత్ కేసరి, పెదకాపు, మన శంకరవరప్రాద్ గారు, ది రాజా సాబ్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారాయన. విలన్ గానూ, కమెడియన్ గానూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ నటుడి చేతిలో పలు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.

View this post on Instagram

A post shared by Vani (@bhavanisan_akula)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us