AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: పాటొచ్చి 34 ఏళ్లు అయ్యింది.. ఇప్పటికీ యూట్యూబ్‌లో అదరగొడుతోంది.. కశ్మీర్ అందాలు హైలైట్

కశ్మీర్‌లోని ప్రకృతి అందాల మధ్య ఈ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించారు. పాటొచ్చి సుమారు 34 ఏళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ యూట్యూబ్ లో ఈ సాంగ్ దుమ్మురేపుతోంది. ఈ పాట కంటే ఇందులో చూపించిన కశ్మీర్ ప్రకృతి అందాలు అందరినీ ఆకట్టుకుంటాయి.

Trending Song: పాటొచ్చి 34 ఏళ్లు అయ్యింది.. ఇప్పటికీ యూట్యూబ్‌లో అదరగొడుతోంది.. కశ్మీర్ అందాలు హైలైట్
Trending Song
Basha Shek
|

Updated on: Jun 14, 2026 | 1:35 PM

Share

భారతీయ సినిమా ఇండస్ట్రీలో 90వ దశకాన్ని సంగీత స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఆ కాలంలోని పాటలు కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రేడియోల్లోనూ, క్యాసెట్ల ద్వారా ప్రతి వీధిలోనూ ఈ పాటలు వినిపించేవి. అలా ఆనాటి పాటల్లో కొన్నీ ఇప్పటికీ సంగీత అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. అలాంటి కాలాతీతమైన పాటల్లో ఒకటి ‘పరువం వానగా నేడు కురిసేనులే’. 1992లో వచ్చిన ‘రోజా’ చిత్రంలోని ఈ ప్రేమ గీతం ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ప్రముఖ గాయకులు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర తమ అందమైన గొంతుతో ఈ పాటకు ప్రాణం పోశారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ రోజా సినిమాకు సంగీతం అందించడం మరో విశేషం.

రోజా సినిమాలోని ఈ రొమాంటిక్ సాంగ్ ను కశ్మీర్‌లో చిత్రీకరించారు. అక్కడి ప్రకృతి రమణీయమైన పరిసరాలు, మంచుతో కప్పబడిన లోయలలో ఈ సాంగ్ ను షూట్ చేశారు. దీంతో ఈ పాట మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ అందమైన పాటలో హీరో, హీరోయిన్లు అరవింద్ స్వామి మధు బాల మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ కూడా హైలెట్ అని చెప్పవచ్చు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ లిరిక్స్, మ్యూజిక్ తో సాగే ఈ పాట సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఇప్పటికీ తెలుగు సినిమాల్లోని బెస్ట్ లవ్ సాంగ్స్ లో ఈ పాటను ఒకటిగా పరిగణిస్తారు. ఈ పాటను ఇప్పటికీ సోషల్ మీడియాలో, వివిధ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా వింటున్నారు. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన రోజా చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సుమారు రూ. 12 కోట్లు వసూలు చేసింది. దేశభక్తి నేపథ్యంలో లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన రోజా సినిమాను తెలుగుతో సహా హిందీ, మళయాళం, మరాఠీ భాషలలో కూడా ఈ సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడం విశేషం. మరి మీరు ఈ రొమాంటిక్ పాటను చూశారా? చూడకపోతే ఒక లుక్కేయండి..

రోజా ‘పరువం వానగా’ వీడియో సాంగ్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..